గడిచిన కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు మంచి హిట్స్ తో దుమ్మురేపుతున్నారు.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ.
సక్సెస్ ఫుల్ గా ముందుకుసాగుతున్నారు.తాజాగా వరుస విజయాలతో మంచి స్వింగ్ లో ఉన్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి
రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్-150 సినిమా చేశాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన సైరా కూడా మంచి హిట్ సాధించింది.
వెంకటేష్
వెంకటేష్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి.తను తాజాగా నటించిన గురు, ఎఫ్2, వెంకీమామ హ్యాట్రిక్ కొట్టాయి.తాజాగా వచ్చిన నారప్ప, దృశ్యం-2తో బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించాడు.
మహేష్ బాబు
ఈయన కూడా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు.భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్
ఈయన నటించిన సినిమాలు కూడా వరుసగా విజయాలు అందుకుంటున్నాయి.టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాలతో వరుస విజయాలు సాధించాడు.
అల్లు అర్జున్ః
అల్లు అర్జున్ కూడా వరుస హిట్లు అందుకుంటున్నాడు. అల వైకుంఠపురంలో, పుష్ప సినిమాలతో మంచి విజయాలను దక్కించుకున్నాడు.
నాగ చైతన్య
నాగ చైతన్య కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.వరుసగా ఆయన చేసిన సినిమాలన్నీ విజయాన్ని అందుకుంటున్నాయి.మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలు సాధించాడు.
రామ్
ఈయన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో పాటు రెడ్ సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.ప్రస్తుతం పలు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
నవీన్ పోలిశెట్టి
ఈయన కూడా మంచి విజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాతో వరుస విజయాలు అందుకున్నాడు.