మీకు వెనీలా ఫ్లేవర్ అంటే ఇష్ట‌మే క‌దా.. ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాక‌వుతారు!

ఐస్‌క్రీమ్‌, కేక్‌లు మొద‌లుకొని ఫుడ్‌ ఐటమ్స్‌ వరకు వెనీలా ఫ్లేవర్‌ను ఇష్టపడేవారు ఈ వార్తను తప్పక చదవాల్సిందే.ఆమ‌ధ్య సోషల్ మీడియాలో వెనీలా ప్లేవ‌ర్ త‌యారీకి సంబంధించిన ఒక వీడియో వైర‌ల్ అయ్యింది.

 Do You Like Vanilla Flavor? If You Know How To Make It, You Will Be Shocked!, Va-TeluguStop.com

ఈ వీడియోను చూసిన లక్షలాది మంది ప్రజలు ఇచ్చిన రియాక్షన్‌ మీకు తెలిస్తే ఈసారి వెనీలా ఫ్లేవర్‌ను రుచి చూసే ముందు ఖచ్చితంగా ఆలోచిస్తారు.వెనిలా బీన్స్‌ సహాయంతో వెనీలా ఫ్లేవర్ తయారు చేస్తార‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే.

కానీ వెనీలా ఫ్లేవర్ కృత్రిమంగా కూడా తయారు చేస్తారు.కృత్రిమంగా వెనీలా రుచిని ఉత్పత్తి చేయడానికి బీవర్ (ఉష్ణ‌మండ‌ల‌పు పెద్ద ఎలుక‌) శ‌రీరం నుండి సేకరించిన రసాయన సమ్మేళనం అవసరం.

కాస్టోరమ్ అనే ఈ రసాయన సమ్మేళనం బీవర్ తోక భాగంలో ఉంటుంది.ఈ ఎలుకలు నీటిలో మరియు భూమిపై నివసిస్తాయి.

కాస్టోరమ్ వినియోగానికి యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమ‌తించింది.2007లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ టాక్సికాలజీ పరిశోధనలో.ప‌లువ‌రు తయారీదారులు ఆహారం మరియు పానీయాల కోసం పెద్ద పరిమాణంలో కాస్టోరమ్‌ను ఉపయోగిస్తున్నారని,పెర్ఫ్యూమ్‌లను తయారు చేస్తున్నారని కనుగొన్నారు.పర్యావరణ శాస్త్రవేత్త జోవన్నా క్రాఫోర్డ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కాస్టోరమ్‌ను సేకరించడానికి బీవర్‌లను మత్తు ఇచ్చి కాస్టోరమ్‌ను సేక‌రిస్తారు.

బీవర్ నుండి ఈ పదార్థాన్ని సేక‌రించ‌డం చాలా కష్టమైన పని.వెనీలా బీన్స్ నుండి ప్రతి సంవత్సరం అమెరికాలో దాదాపు 20 మిలియన్ కిలోల వెనిలా ఫ్లేవర్ సహజంగా ఉత్పత్తి అవుతుంది.అయితే కృత్రిమంగా ఉత్ప‌త్తి అయ్యే వెనీలా ఫ్లేవ‌ర్ దీనికంటే అధిక‌మ‌ని వెల్ల‌డ‌య్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube