ఆ దేశంలోని ఎలక్ట్రానిక్ హైవేల‌ను ప్ర‌పంచ‌మంతా మెచ్చుకుంటోంది... కార‌ణ‌మిదే!

గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న కాలుష్యం మధ్యలో జర్మనీ ప్రపంచానికి ఉదాహరణగా ఒక వినూత్న ప్రయోగం చేసింది.కొత్త ఆవిష్కరణల దేశంగా జర్మనీ పేరొందింది.

 Germany Opens Electric Highways For Trucks, Trucks, Germany, Electric Highways,-TeluguStop.com

ఈ ఆవిష్కరణల ఫలితమే ఎలక్ట్రిఫైడ్ హైవేలు అంటే ఎలక్ట్రిక్ ట్రక్కులు మరియు బస్సులు నడిచే హైవేలు.యూరోపియన్ యూనియన్‌లో జర్మనీ ఒక ముఖ్యమైన భాగం.

ఐరోపాలోని అనేక దేశాలు కాలుష్యాన్ని నిరోధించడానికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కృషి జ‌రుగుతోంది.జర్మనీ మాత్రం ముందంజలో నిలిచింది.

ఇక్కడ పూర్తిగా విద్యుత్తుతో నడిచే హైవేని సిద్ధం చేశారు.

ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్‌పై ఉన్న‌ట్లుగానే ఈ హైవేపై సరిగ్గా అదే రకమైన కేబుళ్లను అమ‌రుస్తారు.

ఓవర్ హెడ్ కేబుల్స్ కారణంగా, ట్రక్కులకు విద్యుత్ సరఫరా కొనసాగుతుంది.ఈ ట్రక్కులు ఒకసారి 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి.

ఈ రహదారి గుండా వెళుతున్నప్పుడు, ట్రక్కులు డీజిల్‌కు బదులుగా హైబ్రిడ్ పవర్ ప్లాంట్‌లను ఎంచుకోవాలి.ఈ రహదారి కారణంగా, కార్బన్-డై-ఆక్సైడ్ మరియు ఇతర ప్రమాదకరమైన విష వాయువుల స్థాయి తగ్గింది.

ఎలక్ట్రిక్ కేబుల్స్ ద్వారా అనుసంధానించబడిన ఏదైనా ట్రక్కు హైవేపై గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.544 కోట్లు. ట్రక్ పరిశ్రమ ప్రస్తుతం కాలుష్యానికి అతిపెద్ద కారణంగా పరిగణించబడుతోంది.

ఈ రహదారి కోసం జర్మనీ ఈ-రైల్ తరహా భారీ ట్రక్కులను రూపొందించింది.ఈ ట్రక్కుల సాయంతో పరిశ్రమ డీజిల్‌పై ఆధారపడటం తగ్గుతుందని చెబుతున్నారు.

అలాంటి మరో హైవేని ప్రారంభించేందుకు జర్మనీ సన్నాహాలు చేస్తోంది.

Foreign countries also interested in EHighway Germany

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube