మీరు ఎప్పుడైనా మీసాలు ఉన్న పక్షిని చూశారా? ఎక్కడుంటుంది? ఏం తింటుంది?

మీరు చాలా రకాల పక్షులను చూసే ఉంటారు.కానీ మీసాలు ఉన్న పక్షిని ఎప్పుడైనా చూశారా? అలాంటి పక్షి పేరు ఇంకా టెర్న్.దీని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది.ఇది చాలా అందమైన పక్షి.ఈ పక్షులు ఎక్కడ ఉంటాయి? ఈ పక్షి పెరూ, చిలీలో కనిపిస్తుంది.దాని శరీరం బూడిద రంగులో ఉంటుంది, దానికి తెల్లటి మీసాలు ఉంటాయి.వాటి ముక్కు, పాదాలు ఆరెంజ్ రంగులో ఉంటాయి.40 సెం.మీ పొడవున్న ఈ పక్షి రాళ్ల ప్రాంతాల్లో కనిపిస్తుంది.ఇది ఇక్కడే సంతానోత్పత్తి చేస్తుంది.

 Have You Ever Seen A Bird With A Mustache Wonder People Egges-TeluguStop.com

ఈ పక్షి చేపలు తినడానికి ఇష్టపడుతుంది.ఇది వేటాడటంలో ఎంతో నేర్పరి.

పొడవైన ముక్కు ద్వారా అది ఒక స్ట్రోక్‌లోనే చేపను పట్టేసుకుంటుంది.ఈ పక్షికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ టెర్న్ ఒకేసారి ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది.ఈ గుడ్డు నుండి పిల్ల బయటకు రావడానికి 4 వారాలు పడుతుంది.

ఈ పక్షి.పిల్లి మాదిరిగా శబ్దం చేస్తుంది.

అమెరికా బర్డ్ కన్సర్వెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ పక్షుల సంఖ్య తగ్గుతోంది.వాటి పరిరక్షణ కోసం, గ్వానో దీవులు, కేప్స్ నేషనల్ రిజర్వ్‌లో పెరువియన్ ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube