విస‌న క‌ర్ర‌ల్లాంటి రెక్క‌లు ఉన్న ఈ చేప‌ల గురించి మీకు తెలుసా..?

ఈ సృష్టిలో ఎన్నో ర‌కాల వింత జంతువులు, క్షీర‌జాలు ఉంటాయి.ఇక భూమ్మీద తిరిగే వాటిల్లోనే ఇప్ప‌టికీ అన్నీ బ‌య‌ట ప‌డ‌ట్లేదు.

 Do You Know About This Fish Which Has Wings Like Whistling Sticks , Flying Fish,-TeluguStop.com

అలాగే స‌ముద్రంలో కూడా అనేక ర‌కాల జంతువులు ఉంటాయి.ఇందులో కొన్ని మాత్ర‌మే మ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించాయి.

అయితే క‌నిపించ‌ని జంతువులు ఇంకా అనేకం ఉంటున్నాయండోయ్‌.ఈ మ‌ధ్య కొన్ని ర‌కాల జంతువులు బ‌య‌ట ప‌డుతున్నాయి.

వ‌లలు వేసిన‌ప్పుడు కొన్ని ర‌కాల కొత్త జంతువులు చిక్కుతున్నాయి.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి చేప‌లు కొన్ని అరుదైన‌వి బ‌య‌ట ప‌డ్డాయి.

మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు చేప‌లు అంటే కేవ‌లం నీటిలో ఈదుతాయ‌ని మాత్ర‌మే తెలుసు.అయితే చేప‌ల‌కు ఎగిరే విధంగా ఉండే విస‌న క‌ర్రల్లాంటి రెక్క‌లు ఉండ‌టం మీరెప్పుడైనా చూశారా.

అంటే నో అనే స‌మాధానం వ‌స్తుంది క‌దా.కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే వార్త వింటే మాత్రం మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.

అవునండి ఇప్పుడు చెప్ప‌బోయే చేప‌ల‌కు మాత్రం విస‌న‌క‌ర్ర‌ల్లాంటి రెక్క‌లు ఉన్నాయి.అవి నీళ్ల‌లో ఎగురుతున్నాయి.

అయితే ఈ చేప‌లు నీల్ల నుంచి ఎగురుతున్నాయి.ఇందుకు సంబంధించిన వీడియో బాగా పాపుల‌ర్ అవుతోంది.

వీటికి ఫ్లైయింగ్ ఫిష్ తో పాటు ఫ్లైయింగ్‌ కాడ్ అలాగే కొల్లోక్వియల్లి అనే పేర్లు కూడా ఉన్నాయి.కాగా ఈ ఎగిరే చేప‌ల్లో దాదాపు 64 రకాల జాతులు ఉన్నాయని తెలుస్తోంది.

స‌ముద్రం లోప‌ల నుంచి అమాంతం పైకి ఎగురుతుంటాయి ఈ చేప‌లు.ఇవి త‌మ శ‌త్రువుల నుంచి త‌ప్పించుకునేందుకు ఇలాంటి రెక్క‌లు బాగా ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని నిపుణులు అంటున్నారు.

కరీబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో ఎక్కువగా ఈ త‌ర‌హా చేప‌లు బాగా క‌నిపిస్తాయంట‌.ఈ చేప‌లను దాదాపు 24 కోట్ల సంవత్సరాల కిందటిదిగా గుర్తించారు సైంటిస్టులు.

వీటి వీడియోలు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube