వైరల్: అందులో సెంచరీ చేసిన ఆ యువతి..!

పాముని చూస్తే భయపడని వారు ఎవరుంటారు.అంతెందుకు కిచెన్ లో బొద్దింకను చూసినా భయపడి పరుగులు తీసే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు.

 Viral The Young Woman Who Made A Century In It, Viral Latest, Viral News, Socia-TeluguStop.com

అలాంటిది చిన్ని సైజు పాము కనిపిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి.

గుండె వేగం పెరుగుతుంది.ఆమడ దూరంలో ఉండే పామును చూస్తేనే భయంతో పరుగుతీస్తారు.

అలాంటింది ఎటువంటి భయం లేకుండా ఓ యువతి పాములను చేతులతోనే పట్టుకుంటుంది.కొందరు మాత్రం పాములను చేతులతో పట్టుకొని పక్కకు పడేస్తుంటారని మనం అప్పుడప్పుడు తోటివారికి చెబుతుంటారు.

అయితే అటువంటి కోవకు చెందిన యువతే స్నేక్ శరణ్య.

మంగళూరులోని అశోక నగరలో నివాసం ఉంటున్న శరణ్య… ప్రస్తుతం బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

చుట్టుపక్కల ఎవరి ఇంట్లో అయినా పాము దూరింది అనే వార్త వినబడితే చాలు.వెంటనే వారి ఇంటికి వెళ్లి తన టెక్నిక్​ ని వాడి వాటిని చాకచక్యంగా పట్టుకుంటుంది.

హుక్-హ్యాండిల్ పద్ధతి ద్వారా పాములను పెట్టుకోవచ్చని.దాని ద్వారా ప్రమాదం అవకాశం ఉండదని చెప్తుంది శరణ్య.

గత రెండేళ్లలో శరణ్య దాదాపు 100 కు పైగా పాములను పట్టుకుంది. పట్టుకున్న వాటిని సురక్షితంగా తీసుకెళ్లి అడవిలో వదిలేస్తుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రతిరోజూ రోడ్లపై ఎన్నో సర్పాలు చనిపోతున్నాయని.

మూగ జీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే వాటిని పట్టి అడవిలో వదిలేస్తున్నట్లు ఆమె తెలిపారు.పాముల గురించి, ఇతర మూగ జీవుల గురించి మా తాతయ్య ప్రకాశ్ చెప్పేవారని దీంతో వాటిపైన ఇంట్రెస్ట్ ఏర్పడిందని.

దీంతో పాముల సంరక్షణపై ఆసక్తి ఏర్పడిందని తెలిపింది.పాములను పట్టుకుంటున్న శరణ్య.

ఇప్పుడు కప్పలపై అధ్యయనం చేస్తోందట.కప్పలపైన ఎమ్మెస్సీ చేయడం అనేది తన లక్ష్యమని ఆమె తెలిపింది.

ఆమె దైర్యం చూసి అందరు ముక్కున వెలుసుకుంటున్నారు.కొందరు ఆమెను మెచ్చుకుంటుంటే మరికొందరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube