పంత్ సిక్స్ కు డిఫరెంట్ స్టెప్పుతో చిందేసిన కోహ్లీ..!

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం రెండవ వన్డే జరిగింది.అయితే ఈ వన్డేలో భారత్ బ్యాట్స్ మెన్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

 Kohli Splits Pant Six With A Different Step , Risab Panth, Sport's Updates, Late-TeluguStop.com

భారత్ భారీ స్కోరు సాధించడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.పంత్ 85 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ లో టీమిండియా సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి డకౌట్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.

డకౌట్‌ అయి నిరాశపరిచిన కోహ్లి.

తన డాన్స్ తో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేశాడు.కోహ్లి డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి పంత్ మెరుపు ఇన్నింగ్స్‌ ని అభినందిస్తూ డ్యాన్స్‌ చేసాడు.

ఓ వైపు కోహ్లీ డ్యాన్స్ చేస్తుండగా.పక్కనే ఉన్న శిఖర్ ధావన్ చిరునవ్వులు చిందించాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Telugu Risab Panth, Ups-Latest News - Telugu

మొదటి వన్డేలో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో గెలవాలనే కసితో భారత టీం బరిలోకి దిగింది.టాస్ గెలిచిన అనంతరం బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.శిఖర్ ధావన్ (29) త్వరగానే అవుట్ అయ్యాడు.

కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు.అయితే.

కోహ్లీకి ఇది 450వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.అంతేగాకుండా వన్డేలో 14వ సారి డకౌట్ అయ్యాడు.

ఇతర బ్యాట్స్ మెన్స్ రాణించారు.రాహుల్ (55), పంత్ (85) పరుగులు చేయడంతో మెరుగైన స్కోరు నమోదైంది.

పంత్, రాహుల్ అవుట్ కావడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు.చివరిలో శార్దూల్ ఠాకూర్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ 2, మగల, మార్క్రమ్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా వీరోచిత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్తో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube