టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ గురించి మనందరికీ తెలిసిందే.మొదట నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవలే పెళ్లిసందడి సినిమాతో మరొకసారి ప్రేక్షకులను అలరించాడు.పెళ్లి సందడి సినిమాతో రోషన్ మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు.
ఈ సినిమాతో మంచి గుర్తింపు పట్టించుకున్న రోషన్ గా వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టారు అని తెలుస్తోంది.ఈ సినిమాతో పాటుగా సితార బ్యానర్ లో కూడా ఒక సినిమాను చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇకపోతే రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు లేడి దర్శకురాలు గౌరీ రోనంకీ దర్శకత్వం వహించింది.ఈ సినిమా సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందింది.
ఇక ఈ సినిమాలో హీరో రోషన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత హీరోయిన్ శ్రీ లీల పలు అవకాశాలను అందుకుంది.పెళ్లి సందడి సినిమాతోనే శ్రీ లీల హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే మంచిగుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో యూత్ ని కట్టిపడేసింది.