ఏపీ ఉద్యోగుల ఆంశం టీడీపీకి కలిసి వస్తుందా? మరి వైసీపీ ఏం చేయబోతుంది...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి.ఉద్యోగులు తమకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపణలు చేస్తున్నారు.

 Does The Issue Of Ap Employees Come Together With Tdp And What Is Ycp Going To D-TeluguStop.com

ఐఆర్ తగ్గించారని ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు.ఇలా చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ సమయంలో ఢీలా పడి ఉన్న టీడీపీ ఉద్యోగులను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది.2019 ఎన్నికల్లో ఉద్యోగుల సపోర్ట్ లేకనే టీడీపీ ఘోర ఓటమిని చవి చూసిందని అనేక మంది చెప్పారు.ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగులను తమ వైపుకు తిప్పుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద ప్లానే వేస్తున్నట్లు అందరూ చెబుతున్నారు.

ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది.

ఇలా ఉద్యోగులకు మద్దతు ప్రకటించడంతో ఉద్యోగులను తమ వైపుకు తిప్పుకోవచ్చునని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.2019 ఎన్నికల్లో ఉద్యోగులు టీడీపీకి వ్యతిరేఖంగా ఓటేశారు.ఆ తేడా చాలా స్పష్టంగా కనిపించింది.

ఈ 2024 ఎన్నికల్లో కూడా ఉద్యోగులు తమకు సపోర్ట్ చేయకపోతే కష్టమని భావించిన చంద్రబాబు వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఎలాగైనా సరే ఉద్యోగుల వద్ద మంచి ఇంప్రెషన్ కొట్టేసి 2024 ఎన్నికల్లో విజం సాధించాలని చూస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు.27 శాతం ఐఆర్ ను తాను అధికారంలోకి రాగానే ప్రకటిస్తానని అన్నారు.తను చెప్పినట్లుగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు.కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.ఎంత త్వ‌ర‌గా అయితే అంత త్వ‌ర‌గా ఈ స‌మస్య‌లు వైసీపీ ప‌రిష్కారం చూపాలి.మరి ఈ పరిస్థితి నుంచి అధికార వైసీపీ ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.

Does The Issue Of AP Employees Come Together With TDP And What Is YCP Going To Do , YCP, Tdp - Telugu Apemployees

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube