వారి దృష్టిలో జ‌గ‌న్ హీరో అవుతారా.. లేక‌పోతే క‌ష్ట‌మే..

రాజ‌కీయాల్లో ఉండ‌టం వేరు.అధికారంలో ఉండ‌టం వేరు.

 Will Jagan Become A Hero In Their Eyes Or Else It Will Be Difficult  , Jagan, Yc-TeluguStop.com

ఎందుకంటే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఇచ్చిన హామీల‌న్నీ అధికారంలోకి రావ‌డం కోస‌మే.కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోతే న‌మ్మ‌కం కోల్పోతారు.

ప్ర‌జ‌లు చూసేది చెప్పిన మాట మీద నిల‌బ‌డ్డారా లేదా అన్నది మాత్ర‌మే.ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇలాంటి ప‌రీక్ష‌నే ఎదుర్కొంటున్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఉద్యోగుల‌కు సీపీఎస్ ను చంద్ర‌బాబు ర‌ద్దు చేయ‌క‌పోతే తానున్నానంటూ జ‌గ‌న్ హామీ ఇచ్చి వారిని త‌న వైపు తిప్పుకున్నారు.

ఇక ఇప్పుడు పీఆర్సీ విష‌యంలో జ‌గ‌న్‌కు చుక్కెదురు అవుతోంది.

రాష్ట్రంలో వారంతా ఉద్య‌మానికి సై అంటున్నారు.పెద్ద ఎత్తున ఆందోళ‌న కూడా క‌నిపిస్తోంది.

అయితే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రుగుతున్న అతి పెద్ద ఆందోళ‌న కూడా ఇదే కావ‌డం విశేషం.ప్ర‌స్తుతం ఉద్యోగులు దాదాపుగా పదమూడు లక్షల మంది ఉన్నారు.

వారి బలం మొత్తం ప్రభుత్వంలో ఉంది.వారు గ‌న‌క విధులు ఆపేస్తే మాత్రం జ‌న‌గ్ స‌ర్కారుకు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వు.

పైగా వారి ఓటు బ్యాంకు కూడా చాలా ఎక్కువ‌.కాబ‌ట్టి వారిని బుజ్జ‌గించి దారిలోకి తెచ్చుకోవాలి.

అంతేగానీ బెట్టు చేస్తే మాత్రం చివ‌ర‌కు జ‌గ‌న్‌కే ఇబ్బందులు ఎదుర‌వుతాయి.అస‌లే ఇప్పుడు టీడీపీ పుంజుకుంటోంది.పైగా ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది.కాబ‌ట్టి వారిని చేజారి పోనివ్వ‌కుండా చూసుకుని వారి దృష్టిలో హీరో అవ‌డం ఇప్పుడు జ‌గ‌న్‌కు అత్యంత అవ‌స‌రం.

ఒక‌వేళ ప్ర‌భుత్వ ఉద్యోగుల మీద‌ జ‌నాల‌కు సింప‌తీ లేద‌ని అనుకున్నా.వారి ఓటు బ్యాంకు ప్ర‌భావం మాత్రం ప‌డే ప్ర‌మాదం ఉంటుంది.కాబ‌ట్టి జ‌గ‌న్ వారితో క‌య్యానికి పోకుండా.వారిని త‌న వెన‌కాల ఉంచుకుంటేనే మంచిద‌ని చెబుతున్నారు.

మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube