వీళ్లు మామూలోల్లు కాదు.. వీడియోలు చూసి ఏకంగా విమానాన్నే త‌యారు చేశారు..

ట్యాలెంట్ ఉండాలే గానీ.అది నిరూపించుకోవ‌డానికి పెద్ద‌గా బ్యాక్ గ్రౌండ్ ఏమీ అవ‌స‌రం లేదు.

 They Are Not Ordinary They Made The Plane Together After Watching The Videos  ,-TeluguStop.com

ఇలా సొంత ప్ర‌తిభ‌తో త‌మ‌ను తాము నిరూపించుకున్న వారు చాలామంది ఉన్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి వారి గురించే మీకు చెప్ప‌బోతున్నాం.

ఇంత‌కు ముందు చాలామంది వివిధ రంగాల్లో త‌మ ట్యాలెంట్ తో చిన్న స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగిన వారు ఉన్నారు.ఇక క్రియేటివిటీ విష‌యానికి వ‌స్తే మాత్రం.

చాలామంది ఎలాంటి కోచింగ్‌లు లేకుండానే ఏదో ఒక ఆవిష్క‌ర‌ణ‌లు చేయ‌డం చూస్తున్నాం.బైకుల మీద చాలామంది ఏదో ఒక ప్ర‌యోగం చేస్తున్నారు.

సీటును పెద్ద‌గా చేయ‌డ‌మో లేదంటే.బైక్‌ను కారులా మార్చేయ‌డం లాంటివి అనేకం చూస్తున్నాం.ఇప్పుడు మాత్రం ఇంకొంచెం పెద్దగా ఆలోచించారు కొంద‌రు.ఇంగ్లండ్ లో ఉండే అశోక్ అలిసెరిల్, అభిలాషా దూబే ఓ అద్భుతం చేసి చూపించారు.

వీరిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు.వారు క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే పెద్ద‌గా జాబ్ సోర్సులు లేక‌పోవ‌డంతో.

త‌మ సొంత ట్యాలెంట్‌కు ప‌దును పెట్టారు.వీడియోగు చూస్తే విమానాన్ని త‌యారు చేయాల‌నుకున్నారు.

ఇక అశోక్ ఇంత‌కు ముందే ట్రైనింగ్ తీసుకున్న పైల‌ట్ కావ‌డంతో ఇది కాస్తా ఈజీ అయిపోయింది.

ఈ జంట ఎప్ప‌టి నుంచో ఓ విమానం కొనాల‌నుకుంటున్నారు.

కానీ అంత స్థాయిలో తాము రేట్లు పెట్ట‌లేమ‌ని భావించి, యూట్యూబ్ వీడియోల‌తో వారే స్వ‌యంగా ఓ విమానాన్ని కొనుగోలు చేశారు.చాలాసార్లు ప్ర‌య‌త్నించి, చివ‌ర‌కు రెండేండ్ల త‌ర్వాత విమానాన్ని త‌యారు చేశారు.

చివ‌ర‌కు అన్ని ర‌కాలుగా స‌క్సెస్ సాధించి విమానాన్ని రెడీ చేశారు.దీన్ని త‌యారు చేయ‌డానికి వారికి రూ.1.57 కోట్లు అయింద‌ని తెలిపారు.రెండేండ్లు నిర్వ‌రామంగా క‌ష్ట‌ప‌డితే చివ‌ర‌కు విమానం రెడీ అయిపోయింద‌ని ఆ జంట ఆనందంగా తెలిపింది.వీరు త్వ‌ర‌లోనే ఇందులో రైడ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube