అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేస్తున్న కేంద్రం...!

భారతదేశ గౌరవానికి భంగం వాటిల్లేలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వెబ్​సైట్లు, యూట్యూబ్​ ఛానళ్లు, సోషల్​ మీడియా అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తోంది.ఇలాంటి ఛానళ్ల నిర్వాహకులను దేశద్రోహులుగా కేంద్రం పరిగణిస్తోంది.

 Central Government Bans Youtube Channels Social Media Accounts Spreading False N-TeluguStop.com

తాజాగా ఈ తరహా యూట్యూబ్​ ఛానళ్లను బ్లాక్​ చేశామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ వెల్లడించారు.అయితే ఇలాంటి చర్యలకు పాల్పడే యూట్యూబ్​ ఛానళ్లు, వెబ్​సైట్లను గుర్తించి నిషేధించేందుకు గవర్నమెంట్ నిఘా వర్గాల సహకారం పొందుతోందని ఆయన వివరించారు.

ఇకపై మరింత కట్టుదిట్టమైన చర్యలతో యూట్యూబ్​ ఛానళ్లు, వెబ్​సైట్లపై నిఘా పెడతామని, దేశ పౌరుల మధ్య హింస చెలరేగేలా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే అందుకు కఠిన శిక్షలు కచ్చితంగా విధిస్తామని తాజాగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు, పన్నాగాలు పన్నుతున్న వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానల్‌లకు తగిన పనిష్మెంట్ ఇస్తున్నామని మంత్రి అనురాగ్​ ఠాకూర్ చెప్పుకొచ్చారు.

ఇంటర్నెట్ లో భారత్​కు వ్యతిరేకంగా 20 యూట్యూబ్​ ఛానళ్లు తప్పుడు ప్రచారాలు నిరంతరాయంగా వ్యాప్తి చేస్తున్నాయి.అయితే నిఘావర్గాలు వీటిని పసిగడతాయి.

ఈ ఛానళ్లతో సహా కొన్ని యాంటీ భారత్ వెబ్​సైట్లు పాకిస్థాన్​ కేంద్రంగా గుర్తు తెలియని నెట్​వర్క్​ ద్వారా రన్ అవుతున్నట్లు నిఘా వర్గాలు తెలుసుకున్నాయి.ఈ విషయాన్ని కేంద్ర సమాచార మంత్రి వర్గానికి తెలియడంతో.

వారు విజ్ఞప్తి చేశారు.

Telugu India, Bans, Central, Channels, Latest, False, Youtube-Latest News - Telu

నిషేధానికి గురైన యూట్యూబ్ ఛానళ్లు కశ్మీర్, రామ మందిరం, ఇండియన్​ ఆర్మీ వంటి అత్యంత సున్నితమైన అంశాలపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ప్రజలపై రుద్దుతున్నారు.ఇలాంటి పక్కదారి పట్టించే వార్తలు ఎప్పటికైనా ప్రమాదమే.ముఖ్యంగా మతాల మధ్య అతి పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది.

అందుకే వీటిని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube