ఉద్యోగ సంఘాలతో అన్ని చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించడం జరిగింది.. మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: ఉద్యోగ సంఘాలతో అన్ని చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల సమ్మెకు వెళ్ళటం సరి కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశారు.

 Minister Botsa Satyanarayana Comments On Prc Details, Minister Botsa Satyanaraya-TeluguStop.com

మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఉద్యోగస్తులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత చర్చించి క్యాబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉద్యోగస్తులకు జీవోలు ఏకపక్షంగా అడ్డగోలుగా ఇవ్వలేదని, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జీవోలు విడుదల చేశామని చెప్పారు.జీవోలు ఇచ్చి తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని… వాటన్నింటినీ పరిశీలించి వాటిపై ఆలోచిస్తామన్నారు.

ఉద్యోగులు నోటీసులు ఇచ్చి దాని మీద చర్చించడం వారి హక్కు… కానీ సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదని మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు.

Botsa Satyanarayana Response on PRC AP Govt Employees

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube