అలెర్ట్: మీ ఆధార్ కార్డు ఇలా ఉంటే చెల్లదు.. ఒకసారి చెక్ చేసుకోండి.. మరి..!

మీ దగ్గర ఇలాంటి ఆధార్ కార్డులు ఉంటే అవి ఇకమీదట చెల్లవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో పాటు ఆ కార్డులకు ఎలాంటి గుర్తింపు ఉండదని కూడా మరోసారి హెచ్చరించడం జరిగింది.UIDAI ఆధార్ కార్డును బయటి మార్కెట్ నుంచి తీసుకున్న PVC బేస్ కాపీని ఉపయోగించడం మంచిది కాదని, అలాంటి PVC కార్డ్‌లు ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉండవని తెలిపింది.

 Alert If Your Aadhaar Card Is Not Valid Check Once And, Alert, Uaid, Aadhar Car-TeluguStop.com

అందుకనే మీరు ప్రింటెడ్ PVC ఆధార్ కార్డ్‌ ని తీసుకోకపోవడమే మంచిది.ఒకవేళ ఇప్పటికే అలాంటి కార్డులను తీసుకుని ఉంటే వాటిని ఎక్కడ ఉపయోగించకపోవడమే మంచిది.

ఒకవేళ మీకు పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్‌లో పేర్కొంది.దాని కోసం మీరు 50 రూపాయిలు చెల్లిస్తే చాలు.

ఒకవేళ PVC కార్డ్ లేదా ప్లాస్టిక్ కార్డ్ లను మార్కెట్ నుండి తయారు చేసినట్లయితే అది చెల్లు బాటు కాదని UIDAI ఒక ట్వీట్‌లో తెలిపింది.

అలాగే బయట మార్కెట్ నుంచి ముద్రించిన ప్లాస్టిక్ కార్డులను తయారు చేయకూడదని కూడా సూచించింది.మీకు ఒకవేళ PVC కార్డు కావాలంటే పోర్టల్‌లో రూ.50 చెల్లించి ఆర్డర్ చేయవచ్చని UIDAI తెలిపింది.మీరు ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లో ప్లాస్టిక్ కార్డు రెడీ చేసి మీరు ఇచ్చిన ఇంటి అడ్రస్ కు వస్తుందిUIDAI ట్విట్టర్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం బయట మార్కెట్లో దుకాణదారులు ఎటువంటి భద్రతా ఫీచర్లు లేని ప్లాస్టిక్ కార్డులను తయారు చేస్తారు.కాబట్టి ఆధార్ నంబర్‌తో భద్రత సమస్య తలెత్తవచ్చు.

అందుకనే నేరుగా యూఐడీఏఐ ద్వారా ఆర్డర్ చేసి స్మార్ట్ కార్డు తీసుకోవచ్చని సూచించింది.

Telugu Aadhar, Worki, Pvc Cards, Uaid-Latest News - Telugu

మీరు బయటి మార్కెట్ నుంచి ఆధార్ కార్డును తీసుకున్నట్లయితే మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.ఎందుకంటే ప్లాస్టిక్ కార్డ్‌ని తయారు చేసే క్రమంలో, అది PDF కాపీ అయినందున దుకాణదారుడు మీ అంగీకారాన్ని తన కంప్యూటర్‌లోకి తీసుకుని అప్పుడు ఆ PDF ఆధారంగా ప్లాస్టిక్ కార్డులు తయారు చేస్తారు.ఆ సమయంలో మీ యొక్క అనుమతితోనే మీ ఆధార్ కార్డ్‌ని వేరొకరి సిస్టమ్‌లో సేవ్ చేయడం జరుగుతుంది.

అది సెక్యూరిటీ పరంగా చూస్తే మంచిది కాదు.అందుకనే అలాంటి చర్యను నివారించేందుకు గాని డైరెక్ట్ గా యూఐడీఏఐ రంగంలోకి దిగి ఆధార్ కార్డును తయారు చేస్తుంది అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube