వారానికో నేత.. చేరికలపై చంద్రబాబు ప్లాన్ అదుర్స్

ఏపీ రాజకీయాల్లో ఉన్న ఆసక్తి, ఆ రాజకీయాలను చూస్తుంటే కలిగే ఉత్కంఠ ఏ రాజకీయాల్లోనూ కలగదు.అంతలా ఏపీ రాజకీయాలు ఎప్పుడూ రంజుగా కొనసాగుతుంటాయి.2019 ఎన్నికల్లో అక్కడ టీడీపీ నుంచి వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది.అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతుంది.

 Weekly Leader Chandrababu Super Plan On Additions , Chandrababu, Tdp-TeluguStop.com

ఆ నిర్ణయాలను ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ తప్పని ఆరోపిస్తూనే ఉంది.అయినా కానీ వైసీపీ ప్రభుత్వం టీడీపీ వాదనలను లెక్క చేయకుండా ముందుకు సాగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రాష్ట్రంలో అనేక ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికల్లో ఎక్కువగా వైసీపీయే సత్తా చాటుకుంటూ వస్తోంది.

ఇక టీడీపీ పని అయిపోయిందని అందరూ అనుకుంటుండగా.ఫొయెనిక్స్ పక్షిలా టీడీపీ లేచి వచ్చింది.

ఇంకా సార్వత్రిక ఎన్నికలకు దాదాపు 2 సంవత్సరాలకు పైగా సమయం ఉండడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని పటిష్టం చేయడం మీద దృష్టి పెట్టారు.ఇందులో భాగంగానే చేరికలను ఆయన ప్రోత్సహిస్తున్నారనే టాక్ నడుస్తోంది.

ఇక మీదట వారానికి ఒక నేత చొప్పున టీడీపీలో చేరికలుంటాయని చెబుతున్నారు.ఇలా చేరికలు ఉంటేనే కింది స్థాయి నేతల్లో, క్యాడర్ లో జోష్ వచ్చి ముందుకు సాగుతారని ఆ పార్టీ అధినేత ప్లాన్ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని వైసీపీకి చెందిన పాలపర్తి డేవిడ్ రాజు చాలా కాలం కిందటే వైసీపీకి రాజీనామా చేశారు.తొలుత ఆయన టీడీపీలో చేరుదామని భావించినా కానీ అధినేత అందుకు ఒప్పుకోలేదట.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేరికల వలనే పార్టీలో ఊపు వస్తుందని భావించిన చంద్రబాబు డేవిడ్ రాజు చేరికకు ఓకే చెప్పినట్లు సమాచారం.అతడు మాత్రమే కాకుండా వైజాగ్ కు చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా చాలా రోజులుగా వైసీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు.

ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వలస వెళ్లిన నేత.కానీ వైసీపీలో గణేష్ ఇమడలేకపోతున్నారనే చర్చ చాలా రోజుల నుంచే నడుస్తోంది.కాబట్టి ఆయన తిరిగి టీడీపీ గూటికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన చేరికకు కూడా అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube