హీరోయిన్ శృతి హాసన్ కు ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా?

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వెండితెర ఎంట్రీ ఇచ్చిన వారిలో నటి శృతిహాసన్ ఒకరు.ఈమె విలక్షణ నటుడు కమల్ హాసన్ గారాల పట్టి అనే విషయం మనకు తెలిసిందే.

 Do You Know Who Is The Favorite Person Of Heroine Shruti Haasan, Shruthi Haasan,-TeluguStop.com

అయితే కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఏ మాత్రం తన తండ్రి ఇమేజ్ వాడకుండా సొంతంగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.అనగనగా ఓ ధీరుడు అనే సినిమా ద్వారా వెండితెర ఆరంగ్రేటం చేసిన శృతిహాసన్ ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి ఈమె ఐరన్ లెగ్ అని భావించారు.

అయితే పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శ్రుతిహాసన్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది.

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఎన్నో వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శృతిహాసన్ ఇంగ్లాండ్ సింగర్ మైకెల్ కోర్సులే అని వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది.

ఇతనితో ప్రేమ వ్యవహారం కారణంగా కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ ఇక తనని పెళ్లి చేసుకుంటారని చాలా మంది భావించారు.వీరి పెళ్లి అనంతరం శృతిహాసన్ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే మైకేల్ ను తీసుకు వచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం చేయడం అన్నీ జరిగిపోయాయి.అయితే వీరి మధ్య ఎలాంటి వివాదం తలెత్తిందో తెలియదు కానీ శృతి హాసన్ తనతో బ్రేకప్ చెప్పుకుంది.

ఇలా సింగర్ మైకేల్ కి బ్రేకప్ చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలకు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో పడింది.అయితే వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా నిత్యం తనతో కలిసి షికార్లు చేసే శృతిహాసన్ ఎన్నోసార్లు మీడియా కంట పడింది.

ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు షికార్లు చేసిన వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు.ఈ క్రమంలోనే వీరికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక పూర్తిగా తన కెరియర్ అయిపోయింది అనుకున్న సమయంలో గత ఏడాది రవితేజతో కలిసి నటించిన క్రాక్ సినిమా ద్వారా మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.ఇలా శృతిహాసన్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

కెరియర్ పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.తాజాగా తన ప్రియుడు శాంతను హజారికాతో కలసి ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా శృతిహాసన్ శాంతను పై తనకు ప్రేమ ఎప్పుడు పుట్టింది,ముందుగా ఎవరు ప్రపోస్ చేశారు అనే విషయాన్ని తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అడగగానే వెంటనే శృతిహాసన్ శాంతను హజారికా వైపు చూపిస్తూ.

తను అంటే ఎంతో ఇష్టమని తెలియజేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Heroine Shruti Haasans Favorite Person Shruti Haasan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube