స్పష్టమైన లక్ష్యంతో తెలంగాణ బీజేపీ... వ్యూహం ఫలించేనా?

తెలంగాణలో వచ్చే రెండున్నర సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ మధ్య ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.ఇప్పటికే మిషన్- 12 లక్ష్యంగా ముందుకు సాగాలని వరుస సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది.

 Telangana Bjp With A Clear Goal  Will The Strategy Work, Telangana Politics, Bjp-TeluguStop.com

ఇప్పటికే పన్నెండు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు టార్గెట్ చేసి సదరు నియోజకవర్గాలలో ఖచ్చితంగా బీజేపీ గెలుపొందాలని అందుకు తగ్గ కార్యాచరణ, వ్యూహాలను కూడా నేతలతో పంచుకుంటూ వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమని నేతలకు నమ్మకాన్ని కలిగిస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తూ కులాల వారీగా నియోజకవర్గాలలో ప్రత్యేక వ్యూహాన్ని అమలు పరిచి గత ఎన్నికల కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందాలనేది ఒక ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

అయితే ఎంత వరకు ఈ వ్యూహం ఫలిస్తుందనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా స్థానికంగా టీఆర్ఎస్ కు ఉన్న బలాబలాలను బట్టి స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ మాత్రం వచ్చే ఎన్నికల్లో మరల అధికారంలోకి వస్తామనే పూర్తి ధీమాతో ఉండగా బీజేపీ మాత్రం ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని సరైన సమయం కొరకు టీఆర్ఎస్ ను గద్దె దింపాలని ఆతృతగా ఉన్నారని విమర్శిస్తోంది.

ఎది ఏమైనా గత ఎన్నికల కంటే బీజేపీకి మెరుగైన స్థానాలు వస్తాయని పలు సర్వేలలో వెళ్లడవుతుండగా ఇక బీజేపీ కూడా మరింత జోష్ తో ముందడుగు వేస్తోంది.అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పై ఇటు సోషల్ మీడియాలో, బహిరంగంగా విమర్శలు చేసినా కార్యకర్తల నిర్మాణం అనేది బలంగా లేకపోతే భారీ విజయాన్ని మాత్రం అందుకోవడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Telangana BJP With A Clear Goal Will The Strategy Work, Telangana Politics, Bjp Party , Bandi Snajay - Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Telangana

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube