ఒమిక్రాన్ విజృంభణ.. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు పొడిగింపు, భారత్ కీలక నిర్ణయం

కరోనా దెబ్బకు తీవ్రంగా ప్రభావితమైన రంగం విమానయానం.ఫస్ట్‌వేవ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుని పలు దేశాలు టూరిస్ట్‌లకు స్వాగతం పలికాయి.

 India Extended The Suspension Of Scheduled International Commercial Passenger Fl-TeluguStop.com

కానీ సెకండ్ వేవ్ వాటికి బ్రేక్ వేసింది.భారత్‌తో సహా పలు దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను దాదాపు అన్ని దేశాలు నిలిపివేశాయి.

అయితే మళ్లీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్క దేశం ఆంక్షలను ఎత్తివేస్తూ వస్తోంది.డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు పలు దేశాలు ప్రకటించాయి.

డిసెంబర్ చివరి నాటికి ప్రపంచం మొత్తం సాధారణ పరిస్ధితులు నెలకొంటాయని అందరూ భావించారు.అయితే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించడంతో ప్రపంచం మరోసారి ముప్పు ముంగిట నిలిచింది.

అనేక దేశాల్లో లక్షలాది సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండగా.యూరప్ అయితే అతలాకుతలమవుతోంది.

ఈ పరిణామాలతో మరోసారి విమానయానం సంక్షోభంలో చిక్కుకుంది.అనేక దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధిస్తున్నాయి.

మనదేశం కూడా ఇదే బాటను అనుసరించింది.ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కోవిడ్, ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది.దాంతో ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.

తొలుత జనవరి 31 వరకు నిషేధం వుండగా.ఇప్పుడు ఆ నిషేధాన్ని మరో నెల రోజులు పొడిగిస్తూ బుధవారం డీజీసీఏ ప్రకటన జారీ చేసింది.

కరోనా తీవ్రత నేపథ్యంలో 2020 మార్చి నుంచి అంతర్జాతీయ పాసింజర్‌ విమాన సర్వీసుల్ని భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే.అయితే 2020 జులై నుంచి వందే భారత్‌ మిషన్‌ కింద ఎయిర్‌ బబుల్‌ ఏర్పాటు చేసి దాదాపు 40 దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

Suspension Of Scheduled International Flights Extends

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube