ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల బోధన నిర్ణయంపై రేవంత్ సెటైర్ లు

తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ప్రభుత్వం స్కూళ్లలో ఆంగ్ల బోధన నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా ప్రతిపక్షాల నుండి మిశ్రమ స్పందన ఎదురవుతోంది.ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 Rewanth Satires On The Decision To Teach English In Public Schools Telangana Pol-TeluguStop.com

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన కాదు ఆంగ్లం బోధించడానికి టీచర్లు ఉండాలి కదా అని రేవంత్ రెడ్డి సెటైర్ లు విసురుతున్నారు.ఇప్పటి వరకు టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నుండి ఎటువంటి ముందడుగు పడలేదని అటువంటిది ఇప్పుడు ఫీజుల నియంత్రణ, ఆంగ్ల బోధన అంటూ అసలు విషయాలను పక్కదారి పట్టించే వ్యూహాన్ని కేసీఆర్ పన్నుతున్నాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే రేవంత్ వ్యాఖ్యలపై కావచ్చు, కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించిన పరిస్థితి లేదు.గత విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ ను  జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఎంత జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోవడాన్ని ఎప్పుడో మానేశారని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ విమర్శలు గుప్పిస్తున్నా అంతగా కేసీఆర్ నుండి స్పందన రాకపోవడంతో పెద్దగా ప్రజల్లోకి వెళ్ళడం లేని పరిస్థితి ఉంది.

ఇప్పటికే ఈ నిర్ణయంపై కేసీఆర్ చాలా కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఇటు ఆంగ్ల బోధన కావచ్చు, ఫీజుల నియంత్రణ చట్టం కావచ్చు ఈ నిర్ణయాల ద్వారా ప్రజల్లో మరోసారి టీఆర్ఎస్ అనుకూల పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది.అంతేకాక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే టీఆర్ఎస్ అతిపెద్ద ప్రచారాస్త్రంగా నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

మరి రేవంత్ వ్యాఖ్యలపై  టీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Rewanth Satires On The Decision To Teach English In Public Schools Telangana Politics, Revanth Reddy, Kcr , Trs Party , Bjp Party, Ts Congress - Telugu @cm_kcr, @ktrtrs, @revanth_anumula, Bjp, English, Public Schools, Telangana, Trs, Ts Congress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube