ఆ విషయంలో వృధా అయిన బీజేపీ ప్రయత్నం...అదేంటంటే?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే.అయితే కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం లోనూ విమర్శలు ఎక్కుపెట్టి రాజకీయంగా బీజేపీ బలపరిచే వ్యూహాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే.

 The Bjp's Wasted Effort In That Regard Is That So, Telangana Politics, Bjp Party-TeluguStop.com

అయితే ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ ను మించిన రాజకీయ వ్యూహకర్త లేడన్న మాట సుస్పష్టం.అయితే కేసీఆర్ ను బేషరతుగా విమర్శించడం ద్వారా ప్రజల చూపు బీజేపీవైపు పడి ఇంకాస్త ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే వ్యూహాన్ని బీజేపీ చాలా పకడ్భందీగా అమలు చేసిన పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ మాత్రం కేసీఆర్ ను తన విమర్శల ద్వారా కదిలించలేకపోయింది.ఒక్క వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయంలో తప్ప ఏ ఒక్క విషయంలో కూడా కేసీఆర్ స్పందించలేదు.

కేవలం పాలనపైనే దృష్టి పెడుతూ ఎవరూ ఊహించని శాఖలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రజల్లోకి పాలన ద్వారా వెళ్లి ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నది కేసీఆర్ వ్యూహంలా అనిపిస్తోంది.

  అయితే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో  బీజేపీకి ఎంతో కొంత ఓటు బ్యాంకు అనేది పెరిగే అవకాశం వందకు వంద శాతం ఉంది.అయితే అధికారం చేపట్టేంతగా వస్తుందా అంటే కొంత ప్రశ్నార్థకమని చెప్పవచ్చు.

ఎందుకంటే ఇంకా స్థానికంగా క్షేత్ర స్థాయిలో బీజేపీకి సరైన కార్యకర్తల బలం అనేది లేదనే విషయం తెలిసిందే.ఇప్పటి వరకు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షం లేని కారణంగానే టీఆర్ఎస్ కు అత్యధిక సీట్లు వచ్చాయని అయితే బలమైన ప్రతిపక్షం ఉండి ఉంటే మాత్రం కొంత ఎమ్మెల్యే స్థానాలు అనేవి తగ్గి ఉండేవని బలమైన చర్చ నడిచిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube