వైరల్ వీడియో: మరోసారి బుర్జ్ ఖలీఫా పై ప్రత్యక్షమైన మహిళ..!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫాపై నిలబడాలంటే ఎవరికైనా సరే గుండె ఆగుతుంది.అలాంటిది ఒక అమ్మాయి ఈ అత్యున్నత శిఖరంపై నిల్చొని పెద్ద సాహసమే చేసింది.

 Woman Once Again On Burj Khalifa Viral Video, Social Media, Viral Video, Viral-TeluguStop.com

అంతేకాదు ఆమె భారీ విమానాన్ని సైతం తన చుట్టూ తిరిగేలా ప్లాన్ చేసింది.ఈ దృశ్యాలు చూడ్డానికి అద్భుతంగా అనిపించాయి.

కానీ ఏమాత్రం పట్టు తప్పినా ఆమె ప్రాణాలు గాల్లో కలిసి పోయే ప్రమాదం ఉంది.అయితే దీనిపై ఆమె ఎందుకు నిలబడిందంటే.

దుబాయ్ ప్రభుత్వం “దుబాయ్ ఎక్స్‌పో” అనే ఓ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది.వ్యాపార సంస్థలు, అవకాశాలను ప్రదర్శించడమే కాకుండా దుబాయ్ ఎక్స్‌పోలో నిర్మాణ అద్భుతాలు, వంటకాలు, సంస్కృతి వంటి అద్భుతమైన ప్రదర్శనలు షో చేస్తారు.

అయితే ఇలాంటి ఎగ్జిబిషన్ ప్రమోషన్ కోసం దుబాయ్ ప్రభుత్వం ఒక మహిళను బుర్జ్ ఖలీఫాపైకి ఎక్కించింది.అలా వినూత్నంగా ప్రమోషన్ చేయించి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

బుర్జ్ ఖలీఫా నేలపై నుంచి 828 మీటర్ల ఎత్తు ఉంటుంది.ఇంత ఎత్తులో ఒక మహిళను నిల్చోబెట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎయిర్‌లైన్స్ ఒక యాడ్ చేయించింది.

అసాధారణమైన సాహసం చేసిన యువతి పేరు నికోల్ స్మిత్-లుడ్విక్‌.ఈమె ప్రొఫెషనల్ స్కైడైవింగ్ శిక్షకురాలు.

Telugu Ups, Latest-Latest News - Telugu

విశేషమేంటంటే ఈమె రెండోసారి బుర్జ్ ఖలీఫా భవంతి ఎక్కి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఆ బిల్డింగ్ శిఖరాగ్రంపై ఆమె చేసిన ఫీట్.చూపించిన ఫ్లకార్డులు ఇప్పుడు నెటిజన్లను షాక్ కి గురి చేస్తున్నాయి.దీనికి సంబంధించిన ఒక వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది.59 సెకన్ల నిడివి గల ఈ యాడ్ వీడియోలో… ‘నేనింకా ఇక్కడే ఉన్నాను.వావ్.

నాకు దుబాయ్ ఎక్స్ పో కనిపిస్తోంది.ప్రపంచంలోనే అతి గొప్ప ప్రదర్శనను వీక్షించేందుకు దుబాయ్ ఎక్స్‌పోకు వచ్చేయండి అని ఆమె ప్లకార్డుల ద్వారా తెలియపరిచింది.

దుబాయ్ ఎక్స్‌పో 2022 మార్చి నెల వరకు కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube