నాని మళ్లీ నెగటివ్ టచ్..!

నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ హిట్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.

 Nani Negative Touch Dasara Movie Details, Dasara Movie, Nani Dasara Movie, Nani-TeluguStop.com

ఈమధ్యనే మాల్దీవ్స్ లో ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో దసరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ కథగా వస్తున్న దసరా సినిమాలో నాని మరోసారి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

నాని ఇప్పటికే జెంటిల్మెన్ సినిమాలో కొద్దిగా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించగా ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ లో వి సినిమా చేశాడు.ఇప్పుడు మరోసారి దసరా సినిమా కోసం నాని నెగటివ్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే నాని దసరా సినిమా కోసం మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.దసరా సినిమా ఈ ఇయర్ దసరా కి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

అంటే సుందరానికీ మాత్రం ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube