దేశంలో తొలిసారి ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉండేవంటే..

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ విభిన్నంగా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం.అయితే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, ఆ తర్వాత జరిగిన మొదటి ఎన్నికలనాటి ప‌రిస్థితులు ఎలా ఉండేవ‌ని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సమయంలో మారుమూల ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టంగా ఉండేది.1951లో మొదటిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోని ప‌రిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం.భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన 4 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి.

 What Was The Situation Like When The First Elections Were Held In The Country, F-TeluguStop.com

ఈ ఎన్నికలు 25 అక్టోబర్ 1951 నుండి ఫిబ్రవరి వరకు జరిగాయి.53 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయగా.1874 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు.లోక్‌సభకు జరిగిన ఈ ఎన్నికలు 401 స్థానాల్లో జరిగాయి.అప్పట్లో దేశ జనాభా 36 కోట్లు కాగా 17.32 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఎన్నికల తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యారు.ఆ సమయంలో కాంగ్రెస్‌కు ఇతర పెద్ద పార్టీల కంటే నాలుగు రెట్లు అధికంగా ఓట్లు వచ్చాయి.అదే సమయంలో సీట్ల పరంగా కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకోగా, సీపీఐ 16 సీట్లు గెలుచుకుంది.45 శాతానికి పైగా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు.

What Was The Situation Like When The First Elections Were Held In The Country, First Elections , 25 October 1951 , Jawaharlal Nehru , Congress Party , Cpi , - Telugu October, Congress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube