ఆ చెట్లకు కాసే పళ్లు అమ్మితే లక్షల్లో డబ్బు... వాటి కోసం హత్యలు చేసేందుకైనా వెనుకాడరు..

ఈ సువిశాల ప్రపంచంలో దేన్నీ తక్కువగా అంచనా వేయలేం.ఇక్కడ వేస్ట్ అయ్యేది అంటూ ఏదీ ఉండదు.

 If Casey Sells Acorns To Those Trees, He Will Get Lakhs Of Money . He Will Not-TeluguStop.com

ప్రతి దానికి ఎంతో కొంత విలువ ఉండే ఉంటుంది.అలా ఓ చోట చెట్లకు కాసే పండ్లకు లక్షల్లో విలువ ఉండడం గురించి వార్త వైరల్ అవుతుంది.

ఇంతకీ అవేం పండ్లు అంటే.

ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో అవకాడో చెట్లకు పండే పండ్ల గురించి తెలిస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.ఈ ఒక్క చెట్టు నుంచి ఏడాదికి దాదాపు రూ.44,500 లాభం వస్తుందట.అంతలా లాభం వస్తే ఎవరు ఊరుకుంటారు.కాబట్టి ఈ కాయలకు దొంగల బెడద కూడా ఎక్కువే.

దొంగల నుంచి ఈ కాయలను రక్షించుకునేందుకు అవకాడో రైతులు చేయని సాహసాలు అంటూ ఉండవు.ఈ పంటలను రక్షించుకునేందుకు కొన్ని చోట్ల అవకాడో రక్షణ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇలా అవకాడో చెట్లను రక్షించుకుంటేనే వాటి కాయలు సురక్షితంగా ఉంటాయని లేకపోతే దొంగలు ఈ కాయలను ఖచ్చితంగా ఎత్తుకుని పోతారని అక్కడి రైతులు చెబుతున్నారు.

Telugu Awakado Fruits, Frootes, Kanya-Latest News - Telugu

ఈ చేన్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ కంచెలను తెంచుకుని మరీ దొంగలు అవకాడో కాయలను దొంగిలిస్తున్నారని అంటున్నారు.కాబట్టే సాయంత్రం చీకటి పడ్డప్పటి నుంచి మరలా సూర్యోదయం వరకు అక్కడ ఈ చెట్లకు రక్షణగా కొన్ని బృందాలు గస్తీ కాస్తాయి.ఈ బృందాలను అవకాడో బృందాలు అని అంటారు.

ఇలా ఈ బృందాల చేతిలో పలుసార్లు దొంగలు హత్యలకు కూడా గురవుతుంటారు.హత్యలు జరుగుతాయని తెలిసినా కూడా ఈ కాయలను దొంగిలించేందుకు దొంగలు వెనుకాడరు.

ఇంకా విచిత్రమేంటంటే.ఈ తోటలకు డ్రోన్లతో కూడా పహారాలు కాస్తూ ఉంటారు.

ఈ విషయం తెలిసి చాలా మంది ఇదెక్కడి చోద్యం రా బాబు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube