పీఆర్సీ జీవోలపై సచివాలయ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి..

అమరావతి: పీఆర్సీ జీవోలపై సచివాలయ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి.సచివాలయంలో రెండు గంటల పాటు సమావేశమైన సచివాలయ ఉద్యోగుల సంఘం.

 Ap Sachivalayam Employees Unhappy With The Government Go On Prc Details, Ap Sach-TeluguStop.com

పీఆర్సీ జీవోలు జారీ చేసిన విధానంపై చర్చ.ఫిట్మెంట్, హెచ్చార్ఏలను భారీగా తగ్గించడంపై ఉద్యోగుల అభ్యంతరం.

నిరసన బాట పట్టాలని నిర్ణయం.రేపటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని డిసైడైన సచివాలయ ఉద్యోగులు.

సచివాలయం ఫస్ట్ బ్లాకులో సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ర్యాలీగా వెళ్లిన సెక్రటేరీయేట్ ఉద్యోగులు.కొందరిని మాత్రమే ఫస్ట్ బ్లాక్ వద్దకు అనుమతించిన భద్రతా సిబ్బంది.

రేపటి నుంచి తాము ఆందోళన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని సీఎస్ శర్మకు వివరిస్తామంటున్న ఉద్యోగులు.పీఆర్సీ జీవోలను రోల్ బ్యాక్ చేయాలని సెక్రటేరీయేట్ ఉద్యోగుల డిమాండ్.

సీఎస్ అందుబాటులో లేకపోవడంతో పేషీలో రిప్రజేంటేషన్ ఇచ్చిన సెక్రటేరీయేట్ ఉద్యోగులు.

సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ… గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చిస్తోంది.

ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవు.ఆఫీసర్స్ కమిటీని మొదటి నుంచి వ్యతిరేకించాం.

ఫిట్మెంట్ తక్కువైనా.మిగిలిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో అంగీకరించాం.

హెచ్చార్ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలని గతంలో సీఎంకు చెప్పాం.హెచ్చార్ఏను తగ్గించడాన్ని.

ఇతర అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారు.

కొన్ని అంశాల్లో రాజీ పడడానికి సిద్దమే.కానీ ప్రతి అంశంలోనూ రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు.పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి.

మిగిలిన సంఘాలతో కూడా కలిసి చర్చించుకుని ఉమ్మడి వేదిక మీదకు వచ్చి పోరాడేందుకు సిద్దం.మిగతా సంఘాలకు ఏమైనా ఇగోలుంటే మేమే ముందుకు వచ్చి మాట్లాడ్డానికి సిద్దం.

ఈ సాయంత్రం సీఎం అప్పాయింట్మెంట్ కోరుతున్నాం.భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ భేటీ అవుతాం.

రేపు లేదా ఎల్లుండి నుంచి ఉద్యమించేందుకు సన్నద్దంగా ఉన్నాం.

Ap Sachivalayam Employees Unhappy With The Government Go On Prc Details, Ap Sachivalayam Employees ,unhappy , Government Go On Prc, Venkatrami Reddy, Hrc, Government Employees, Ap Govt, Cm Jagan, Cs Sameer Sharma - Telugu Ap, Apsachivalayam, Cm Jagan, Employees, Prc, Unhappy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube