గుమగుమలాడే వంట చేసిన యాంకర్ రవి.. నెటిజెన్ అలాంటి కామెంట్?

యాంకర్ రవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా చేస్తూ తన మాటలతో, అల్లరి తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

 Anchor Ravi Cooking Video Netizen Comments Viral Details,  Anchor Ravi, Cooking-TeluguStop.com

అంతేకాకుండా బుల్లితెరపై ఉన్న మేల్ యాంకర్ లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.యాంకర్ రవి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే తన అభిమానులతో తన విషయాల గురించి, తన ఫ్యామిలీ విషయాల గురించి పంచుకుంటూ ఉంటాడు.

సోషల్ మీడియాలో యాంకర్ రవి కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.రవి బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

తప్పకుండా ఈసారి టైటిల్ విన్నర్ యాంకర్ రవి అవుతాడు అని ప్రతి ఒక్కరూ భావించారు.కానీ ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసాడు.

ఆ సమయంలో బిగ్ బాస్ షో నిర్వాహకులను యాంకర్ రవి అభిమానులు తప్పు పట్టడమే కాకుండా, షో నిర్వాహకులు పై విమర్శలు సైతం గుప్పించారు.

ఇక యాంకర్ రవి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటారు ఉంటాడు.

మరీ ముఖ్యంగా తన భార్య, కూతురు వియా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే యాంకర్ రవి కి తన కూతురు అంటే ప్రాణం అన్న విషయం అందరికి తెలిసిందే.తన కూతురికి ఎంతో ఇష్టమైన మటన్ చికెన్ కర్రీ చేస్తాడు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా కనుమ పండుగ సందర్భంగా యాంకర్ రవి తన కూతురికి ఇష్టం అయినా మటన్ కూర ను వండాడు.

అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇక ఆ వీడియో ఫై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.ఈ క్రమంలోనే ఒక లేడీ ఫ్యాన్ చూస్తుంటే నోరూ ఊరుతోంది అని కామెంట్ చేయగా.వెంటనే రిప్లై ఇచ్చిన రవి.ఇంటికి వచ్చేయండి అంటూ రిప్లై ఇచ్చాడు.యాంకర్ రవి రిప్లై ఇవ్వడం తో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube