అవకాశం వచ్చిందని.. యాంకర్ అనసూయపై హైపర్ ఆది రోమాంటిక్ కామెంట్స్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హైపర్ ఆది మాటకు మాటకు పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.

 Hyper Aadi Romatic Comments On Anasuya Bharadwaj, Jabardasth, Anasuya, Hyper Aad-TeluguStop.com

అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు స్కిట్ లలో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడుతూ ఉంటాడు.ఇక షో లో జడ్జి ని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు.

హైపర్ ఆది ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా జరిగే వాటిని స్క్రిప్ట్ రూపంలో ప్రదర్శిస్తూ ఉంటాడు.ఇక హైపర్ ఆదికి అనసూయ కనిపిస్తే ఎలా చేస్తాడో మనందరికీ తెలిసిందే.

ఇక అనసూయ ని చూడగానే హైపర్ ఆది మెలికలు తిరుగుతూ తెగ మురిసిపోతుంటాడు.కొన్ని కొన్ని సార్లు అనసూయ పై పంచులు వేస్తూ ఉంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా హైపర్ ఆది చేసిన స్కిట్ కీ సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.హైపర్ ఆది, అనసూయ లు ఇప్పటికే ఆన్ స్క్రీన్‌ లో చాలాసార్లు రోమాంటిక్ స్టెప్పు లేసి బుల్లితెర ఆడియన్స్‌ ని అలరించారు.

ఈ క్రమంలోనే తాజాగా పుష్పరాజ్ గెటప్ వేసి అనసూయను ఉద్దేశిస్తూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాజాగా విడుదలైన జబర్ధస్త్ ఎపిసోడ్ ప్రోమోలో హైపర్ ఆది పుష్ప సినిమాలోని క్యారెక్టర్లను రీ- క్రియేట్ చేశాడు ఆది.పుష్పరాజ్‌ పాత్రను హైపర్ ఆది పోషించాడు.ఇక ఎంట్రీ ఇవ్వడంతోనే పుష్పరాజ్ గా అనసూయ పై కన్నేశాడు.

స్కిట్ లో భాగంగా హైపర్ ఆది అచ్చం పుషరాజ్ హావభావాలతో ఎందులో కూడా తగ్గేదే లే అంటూ కలరింగ్ ఇచ్చాడు.ఇక అనసూయను చూస్తూ మనోడు చేసిన కామెంట్స్ తెగ నవ్వించాయి.అనసూయ లవ్ చేస్తోందని నాకు తెలుసు రా.అంటూ పుష్ప సీన్ రీ- క్రియేట్ చేశాడు ఆది.ఇదంతా చూస్తూ అనసూయ తెగ సిగ్గు పడిపోతుండటం, ఆమె ఫీలింగ్స్ ఈ వీడియోలో మరింత అట్రాక్షన్ అయ్యాయి.ఇక అనసూయ పుష్ప సినిమాలో నటించిన దాక్షాయిని పాత్రను కమెడియన్ శాంతి స్వరూప్ పోషించాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube