అరుంధతి సినిమాకు హీరోయిన్ గా ముందు అనుకున్నది అనుష్కని కాదా?

కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా నటించిన చిత్రం అరుంధతి.ఈ సినిమా 2009 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 16న విడుదల అయిన విషయం తెలిసిందే.

 Arundhati 13 Years Completed Untold Facts About Anushka Shetty Arundhati Movie ,-TeluguStop.com

అప్పట్లో ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అంతేకాకుండా అరుంధతి సినిమా అనగానే ప్రేక్షకులకు మొదటగా గుర్తుకువచ్చే పేరు అనుష్క.

అరుంధతి సినిమా అంటే అనుష్క.అనుష్క అంటే అరుంధతి సినిమా అన్న విధంగా ప్రేక్షకుల మనసులో ముద్ర పడిపోయింది.

అయితే అప్పటి వరకూ లవ్ రొమాంటిక్ సినిమా లో నటించిన అనుష్క ఒక్కసారిగా అరుంధతి తో తన నట విశ్వరూపాన్ని చూపించింది.

అనుష్క ను టాప్ హీరోయిన్ గా నిలబెట్టిన సినిమా లలో అరుంధతి సినిమా కూడా ఒకటి.

అరుంధతి సినిమాతో అనుష్క కేరిర్ మారిపోయింది.ఈ సినిమాను మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి జనవరి 16 నాటికి 13 ఏళ్లు పూర్తి అయ్యింది.అయితే మొదట ఈ సినిమాలో నటించే అవకాశం అనుష్కకు రాలేదట.

మలయాళ కుట్టి మమతా మోహన్ దాస్ ను అరుంధతి సినిమాలో హీరోయిన్ గా సంప్రదించారట.అయితే ఆమె అప్పుడప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, ఎలాంటి కథలు ఎంచుకోవాలో పెద్దగా తెలియక పోవడంతో ఆమె అరుంధతి సినిమాని వదులుకున్నాను అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Telugu Anushka Shetty, Arundhati, Mamta Mohanda, Tollywood-Movie

అంతే కాకుండా ఆమె ఇతర సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల విముఖత వ్యక్తం చేసిందట.ఈ సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత రెండు నెలలకు క్యాన్సర్ ఉన్నట్లు ఆమెకు తెలియడంతో, అరుంధతి సినిమా కంటే బతికి ఉంటే చాలు అన్న బాధతో ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపింది.ఆ తర్వాత ఆ సినిమా అవకాశం అనుష్కకు రావడం ఆమె ఓకే చెప్పడంతో తొందర తొందరగా షూటింగ్ పనులు పూర్తి చేసి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే ఈ సినిమా తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా అనుష్క పేరు మారుమోగి పోవడమే కాకుండా ఆమె అభిమానులు అంతా ఆమె ముద్దుగా జేజమ్మ జేజమ్మ అని కూడా పిలిచేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube