జగ్గా రెడ్డికి సొంత పార్టీలోనే బ్రేకులు వేస్తున్నారా.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి రూటే సపరేటు.ఈ మాట చాలా మంది చెబుతుంటారు.

 Are Congress Leaders Putting The Brakes On Jagga Reddy In His Own Party Details,-TeluguStop.com

పార్టీ మొత్తం ఓ వేలో వెళ్తే ఆయన మాత్రం డిఫరెంట్ వేలో వెళ్తారు.ఆయన ఎప్పుడు ఎటువంటి దీక్షలు చేస్తారో ఆ పార్టీ శ్రేణులకే అర్థం కాదు.

అందుకోసమే ఆయన్ను పార్టీ ఎక్కువగా పరిగణలోకి తీసుకోదని అందరూ అంటుంటారు.ఇలా ఇప్పుడు కూడా ఓ విషయంలో జగ్గా రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పార్టీ అడ్డు పుల్ల వేసిందని చర్చించుకుంటున్నారు.

పార్టీ నిర్ణయం వలన జగ్గా రెడ్డి చాలా డిస్టర్బ్ అయ్యారని అనుకుంటున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే…

జగ్గా రెడ్డి తనదైన స్టైల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కు చెక్ పెట్టేలా కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

జగ్గా రెడ్డి చేసే పలు కార్యక్రమాలు విజయవంతం కూడా అయ్యాయి.తను చేసిన దీక్షలకు ప్రభుత్వాలు దిగి వచ్చిన సందర్భాలను కూడా మనం చూశాం.

ఇప్పుడు కూడా అలాంటి దీక్షనే ఆయన ప్లాన్ చేసుకున్నారట.కానీ పార్టీ మాత్రం ఆ రోజు వేరే పని చేయమని ఆదేశించిందని సమాచారం.

ఇలా పార్టీ ఆదేశించడంతో జగ్గా రెడ్డికి ఏం చేయాలో తోచడం లేదని అంతా అనుకుంటున్నారు.

రేపు జగ్గా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారు.సీఎంకు అనేక సమస్యలను విన్నవిస్తావని ఆయన చెప్పారు.కానీ 16వ తేదీన సీఎల్పీ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జగ్గా రెడ్డి ఒక్కరే పోరాటం చేయడం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి సీఎం కేసీఆర్ కు లేఖ రాయాలని పార్టీ ఆదేశించింది.

సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే ప్రగతి భవన్ వద్ద పోరాటం చేయాలని పార్టీ ఆదేశించింది.పార్టీ అలా చెప్పడంతో జగ్గారెడ్డి కూడా తప్పక ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది.

Are You Putting The Brakes On Jagga Reddy In His Own Party What Is Going On In The Actual Congress - Telugu Jagga Reddy, Congress

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube