సంక్రాంతి స్పెషల్... తల్లికి ఖరీదైన నెక్లెస్ ఇచ్చిన అషు రెడ్డి.. ఖరీదెంతంటే?

పండుగలు వచ్చాయంటే చాలు మహిళలు ఆభరణాలను, వస్త్రాలను, ఇంటికి సంబంధించిన వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు.

 Bigg Boss 3 Contestant Ashu Reddy Buy Gold Jewellery Mother, Bigg Boss , Ashu Re-TeluguStop.com

పండుగ సమయాలలో కొత్త కొత్త ఆభరణాలు, కొత్త దుస్తులను ధరించి ఆలయాలను సందర్శిస్తుంటారు.ఇకపోతే నిన్న సంక్రాంతి పండుగను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి కూడా సంక్రాంతి పండుగ ను సెలబ్రేట్ చేసుకుంది.సంక్రాంతి పండుగ సందర్భంగా తన తల్లి కోసం అషురెడ్డి బంగారాన్ని కొనుగోలు చేసింది.

అయితే ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది.ఇక ఆ వీడియోలో గోల్డ్ షాప్ కి వెళ్ళిన అషురెడ్డి అక్కడ ఉన్న నగలను ధరిస్తూ తెగ మురిసి పోయింది.

అయితే ఆ నలుగురు తన కోసం కాదని, ఆ తల్లి కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు అషు రెడ్డి చెప్పుకొచ్చింది.అషురెడ్డి ఆ నగలను ఇంటికి తీసుకువెళ్లి తన తల్లికి గిఫ్ట్ గా ఇచ్చి ఆమెను సర్ప్రైజ్ చేసింది.

నిద్రపోతున్న తన తల్లిని లేపి ఆ గిఫ్ట్ ని ఇవ్వగా ఆ గిఫ్ట్ చూసి ఆమె మురిసిపోతూ నిద్రమబ్బు పోయింది అంటూ చెప్పడం కాస్త నవ్వులు పూయించింది.అయితే అంతకుముందు అషు రెడ్డి తన తల్లికి బంగారు గాజులను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే.వాటిలోకి అషు రెడ్డి తాజాగా కొన్న గోల్డ్ నెక్లెస్ సూట్ అవుతుంది అనే ఆమె తల్లి సంతోషపడింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube