నిరుద్యోగ భృతి అమలుపై మిశ్రమ స్పందన...ప్రభుత్వం పునరాలోచించేనా?

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.అందులో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, మిషన్ భగీరథ లాంటి పధకాలు ఉన్న విషయం తెలిసిందే.

 Mixed Reaction On The Implementation Of Unemployment Benefits Will The Governme-TeluguStop.com

అయితే కేసీఆర్ ఇచ్చిన హామీలలో నిరుద్యోగ భృతి ఒకటి.అయితే మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగులకు నెలకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ హామీపై పెద్దగా ప్రభుత్వం నుండి స్పందన రాలేదు.ఏమాత్రం కసరత్తు కూడా ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది.

అయితే తాజాగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నిరుద్యోగ భృతి అమలు వార్తలు పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం నేపథ్యంలో యువత నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

నిరుద్యోగ భృతి కొరకు ఎవరూ వేచి చూడటం లేదని, ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తే ఉపాధి పొందే అవకాశం ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రభుత్వం ఇంకా నిరుద్యోగ భృతి అమలుపై అధికారికంగా స్పందించకున్నా వార్తను లీక్ చేసి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం నిరుద్యోగులందరు ఉద్యోగ నోటిఫికేషన్ ల కొరకు ఎదురుచూస్తున్న పరిస్థితిలో ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తేనే యువతలో పార్టీకి మంచి ఆదరణ దొరుకుతుందని కాని నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారం మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగ భృతి అమలుచేస్తే పడే రెవెన్యూ భారం ఎంత అనే విషయం పట్ల ఆర్థిక శాఖను నివేదికను కూడా కోరినట్టు తెలుస్తోంది.

Mixed Reaction On The Implementation Of Unemployment Benefits Will The Government Reconsider, Kcr, Trs Party - Telugu @cm_kcr, @trspartyonline, Telangana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube