సిరిపై మళ్లీ దారుణ ట్రోల్స్‌... మౌనంగా ఉండలేవా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి అయ్యి వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆ విషయమై వివాదాలు.చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

 Siri About Shannu Love Breakup, Siri , Shanmukh , Biggboss , Telugu Biggboss, To-TeluguStop.com

బిగ్‌ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో సిరి మరియు షన్నూ లు క్లోజ్ గా ఉండటం.వారు ఒకానొక సమయంలో చాలా దగ్గర అవ్వడం జరిగింది.

ఆ కారణంగానే బయటకు వచ్చిన తర్వాత షన్నూ కు దీప్తి బ్రేకప్ చెప్పింది అనేది చాలా మంది వాదిస్తున్నారు.ఈ సమయంలో కొందరు సిరి నే వారి బ్రేకప్‌ కు కారణం అంటూ విమర్శలు చేస్తున్నారు.

పెద్ద ఎత్తున సిరి పై ట్రోల్స్ వచ్చాయి.పచ్చని సంసారంలో నిప్పులు పోశావు కదా సిరి అంటూ చాలా మంది ఆమెను బ్యాడ్‌ కామెంట్స్ తో టార్గెట్‌ చేసిన సంగతి తెల్సిందే.

మెల్ల మెల్లగా ఆ విషయాల గురించి జనాలు మర్చి పోతున్నారు అనుకుంటూ ఉండగా సిరి మళ్లీ ఆ విషయాన్ని రెచ్చ బెట్టే విధంగా మాట్లాడింది.

తాజాగా ఆమె షన్నూ మరియు దీప్తి ల బ్రేకప్ గురించి మాట్లాడింది.

వారిద్దరిది చాలా స్ట్రాంగ్‌ లవ్‌.వంద రోజులు వ్యవహారం తో వారి లవ్ బ్రేకప్ అయ్యేంత వీక్ కాదు అన్నట్లుగా సిరి వ్యాఖ్యలు చేసింది.

సిరి వ్యాఖ్యలు అర్థ రహితంగా ఉన్నాయంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే.బుద్ది లేకుండా మళ్లీ ఎలా మాట్లాడుతున్నావు.

మౌనంగా ఉండలేవా అంటూ మరి కొందరు ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా హితవు పలుకుతున్నారు.

పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న సమయంలో సిరి మళ్లీ ఎలా రియాక్ట్‌ అవ్వబోతుంది అనేది చూడాలి.మరో వైపు సిరి మరియు శ్రీ హాన్ ల విషయమై ఎలాంటి క్లారిటీ రావడం లేదు.ఇద్దరు కూడా కలిసి ఉన్నారా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో జనాలు జుట్టు పీక్కుంటున్నారు.

పెద్ద ఎత్తున సిరి మరియు శ్రీ హాన్ ల బ్రేకప్‌ వార్తలు వస్తున్నాయి.మరింత క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube