యూపీ బీజేపీలో సంక్షోభం నేత‌లు ఎందుకు పార్టీని వీడుతున్నారు..

యూపీలో బీజేపీకి భారీనష్టం చేకూరనుంది.ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీలోని మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మంది పార్టీ మారుతున్నారని సమాచారం.

 Crisis In Up Bjp Why Are The Leaders Leaving The Party Details, Bjp, Up Politics-TeluguStop.com

ఇప్పటికే పార్టీలోని కొందరు సీనియర్ నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.

తాజాగా మంత్రి ధర్మ్ సింగ్ సైతం పార్టీకి రిజైన్ చేశారు.యోగి ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్నదన్న ఉద్దేశంతోనే చాలా మంది పార్టీని వీడుతున్నట్టు సమాచారం.

ఇప్పటికే కీలక నేతల పార్టీ నుంచి తప్పుకున్నారు.మరి కొందరు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

త్వరలోనే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నారంటూ సమాజ్ వాదీ పార్టీ లీకులు ఇస్తున్నది.

స్వామి ప్రసాద్ మౌర్య సీనియర్ నేత.ప్రస్తుతం ఆయన సైతం బీజేపీకి రిజైన్ చేశారు.ఆయనతో పాటు చాలా మంది నేతలు కమలం పార్టీని వీడారు.

వెనుకబడిన వర్గాల నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విషయమే ఇందుకు కారణమని తెలుస్తోంది.తమ పార్టీ ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని బీజేపీ చెబుతున్నది.

గతంలో పోల్చుకుంటే తమ పార్టీ ప్రస్తుతం బలంగా మారిందని చెబుతున్నది కమలం పార్టీ.ఇక బీజేపీలోంచి బయటకు వచ్చిన వారు ఎస్పీలో చేరనున్నారని టాక్.

ప్రసాద్‌మౌర్య వంటి ఓబీసీ లీడర్లు పార్టీన వీడటం వల్ల బీజేపీ కాస్త నష్టమనే చెప్పాలి.2014 తరువాత బీజేపీలోంచి బయటకు వెళ్లిన వారి కంటే పార్టీలో చేరిన వారే ఎక్కువగా ఉన్నారు.దీంతో బీజేపీకి ఓటు బ్యాంక్ సైతం పెరిగింది.ఇక 2017 తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.అయితే ప్రజలకు మంచి చేయని నాయకులు బీజేపీలో ఉన్నా.లేదా ఇతర పార్టీలో ఉన్నా.ఒక్కటేనని రాకేశ్ చెప్పుకొచ్చారు.

Crisis in UP BJP Why are the leaders leaving the party ?, BJP, UP politics -

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube