సంక్రాంతి పండుగలో గంగిరెద్దుల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి.

 Do You Know The Importance Of Gangireddu In Sankranthi Festival, Sankranti, Fest-TeluguStop.com

పూర్వకాలంలో సంక్రాంతి పండుగ రోజు పెద్ద ఎత్తున గంగిరెద్దులు కోలాహలం చేసేవి.ప్రస్తుత కాలంలో గంగిరెద్దులు కనుమరుగైపోయాయి.

అయితే సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దులు ఎందుకు ఊరు ఊరు తిరుగుతాయి.అసలు సంక్రాంతి పండుగకు గంగిరెద్దుల కు గల సంబంధం ఏమిటి.

అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం గజాసురుడునే రాక్షసుడు ఆ శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో కఠినమైన తపస్సు చేశారు ఇలా అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా అందుకు ఆ రాక్షసుడు శివుడు తన గర్భంలో ఉండాలని కోరుకోవడంతో అతని కోరిక మేరకు పరమేశ్వరుడు గజాసురుని గర్భంలో ప్రవేశించాడు.

ఈ క్రమంలోనే పార్వతీదేవి తన పతి కనిపించకపోవడంతో శ్రీహరి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పగానే శ్రీహరి వెంటనే గంగిరెద్దు మారువేషంలో సకల దేవతలతో కలిసి ఎన్నో వాయిద్యాలతో గజాసురుడు ముందుకు వెళ్లి కోలాహలం చేస్తూ నాట్యం ఆడారు.

ఇలా తమ నాట్యానికి మంత్రముగ్ధుడైనా గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమని ప్రశ్నించగా వెంటనే గంగిరెద్దు వేషంలో ఉన్న విష్ణుమూర్తిశివుడి వాహనమైన నంది తన స్వామి దూరం అయ్యాడని చింతిస్తున్నాడు.

వెంటనే తన స్వామిని తన చెంతకు పంపించు అని అడుగుతాడు.ఇలా అడగడంతో వెంటనే తేరుకున్న గజాసురుడు వచ్చింది విష్ణుమూర్తి అని గ్రహించి తనకు మృత్యువు తప్పదని భావించాడు.

విష్ణువు ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు గజాసురుని గర్భాన్ని చీల్చడంతో శివుడు బయటకు వస్తాడు.

ఇచ్చిన మాట తప్పని గజాసురుని శిరస్సును లోకంలో ప్రతి ఒక్కరూ పూజించాలని, తన చర్మాన్ని తాను ధరించి లోకం మొత్తం తిరుగుతూ పూజలందు కోవాలని సూచించారు.ఇలా పరమేశ్వరుడి మోక్షం పొందిన గజాసురుడు ధనుర్మాసంలో ప్రతి ఇంటికీ తిరుగుతూ అందరిచేత పూజలందుకుంటున్నారు.ఇలా సంక్రాంతి పండుగకు ముందు గంగిరెద్దులు ప్రతి ఒక్క ఇంటి ముందు సందడి చేస్తూ ఉండేవి.

అయితే ప్రస్తుతం ఈ ఆచారం కనుమరుగై పోతుందని చెప్పవచ్చు.

do you know the importance of gangireddu in sankranthi festival, sankranti, festival, gangireddy, importance - Telugu Festival, Gangi, Importance, Sankranti

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube