చీమ‌ల‌న్నీ ఒకే లైనులో ఎందుకు వెళ‌తాయో తెలుసా?

చిన్నతనంలో చీమలకు సంబంధించిన‌ కథలు వినేవుంటాం.చీమలు క్రమశిక్షణకు ఉదాహ‌ర‌ణ అని చెబుతుంటారు.

 Why Do Ants Walk In A Straight Line Details, Ants, Ants In Straight Line, Queen-TeluguStop.com

చీమలు తిన్న‌ని గీత మాదిరిగా న‌డ‌వ‌టాన్ని మనం చేసేవుంటాం.అయితే ఇలా అవి ఎందుకు చేస్తాయ‌ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలో 12 వేల‌ కంటే ఎక్కువ జాతుల చీమలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.చీమల సైజు కేవలం 2 నుంచి 7 మిల్లీమీటర్లు.అయితే అవి వాటి బరువు కంటే 20 రెట్లు ఎక్కువ బ‌రువును మోసే సామర్థ్యం కలిగి ఉంటాయని చెబుతుంటారు.

రాణి చీమకు ఆహారం ఏర్పాటు చేయడం చీమల కాలనీలో పనిచేసే కార్మిక చీమల పని.ఈ చీమలు తమ గ్రాహకాల సహాయంతో ఆహారాన్ని వెతుక్కుంటూ బయటకు వెళ్తాయి.ఆహారం గురించి తెలిసిన వెంటనే ఫెరోమోన్స్ అనే ద్రవాన్ని అక్కడ విడిచి పెడ‌తాయి.

ఒక అంచనా ప్రకారం, కార్మిక చీమలు తమ నివాసానికి 100 గజాల దూరం వ‌ర‌కూ ఆహారాన్ని వెద‌క‌డం కోసం వెతకడానికి వెళ్తాయి.చీమలలో ఒక ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది.

దీని పేరు ఫెరోమోన్స్.చీమలు ఈ రసాయనం సహాయంతో ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి.

కార్మిక చీమలు ఆహార వనరుల గురించి తెలుసుకున్నప్పుడు, అవి తిరిగి రావడానికి ఫెర్మోన్స్ లిక్విడి సహాయంతో ఒక గుర్తును వదిలివేస్తాయి.ఈ విధంగా కార్మిక చీమలు వాటిని అనుసరించే చీమలకు సూచ‌న చేస్తాయి.ప్రతి చీమ తన తర్వాత వచ్చే చీమలకు గుర్తుల‌ను వదిలివేస్తుంది.ఇదే అవి ఒక తిన్న‌నైన రేఖ‌లో న‌డిచేందుకు గ‌ల కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

why do ants walk in a straight line details, ants, ants in straight line, queen ant, reason, ants food, ants walk, food searching, scientific reason, ants colonies, liquid - Telugu Line, Walk, Liquid, Queen Ant, Scientific

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube