వైరల్ వీడియో: అచ్చం సినిమాలో వలే పోలీస్ ఛేజింగ్..! చివరకి..?!

సాధారణంగా సినిమాల్లో పోలీసులు దొంగలను రోడ్లపై ఛేజ్ చేసి పట్టుకున్నట్లు చూస్తుంటాం.ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి.

 Viral Video Cinematic Police Chasing Scene In Karnataka Mangalore Details,  Vira-TeluguStop.com

కానీ అవన్నీ ఎక్కువగా మన కంటికి కనిపించవు.ముఖ్యంగా ఎస్సై లాంటి పోలీస్ ఆఫీసర్లు పట్టపగలు నడిరోడ్డుపై ఒక దొంగను పట్టుకోవడం వంటి సినిమాటిక్ దృశ్యాలు కనిపించడం చాలా అరుదనే చెప్పాలి.

అయితే తాజాగా అలాంటి దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమైంది.దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

హీరోలా దొంగని అద్భుతంగా పట్టుకున్నారని సార్ అని ఆ పోలీస్ కు కితాబిస్తున్నారు.ఈ వీడియోని కిరణ్ పరాశర్ అనే ఒక జర్నలిస్టు షేర్ చేశారు.

కాగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.

బుధవారం రోజు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఒక వలస కూలీ విశ్రాంతి తీసుకుంటుండగా.అతని ఫోన్ కొట్టేసాడో దొంగ.

దీంతో సదరు బాధితుడు దొంగ.దొంగ.

అంటూ అతడి వెంట పడటం ప్రారంభించాడు.దీన్ని గమనించిన అసిస్టెంట్ రిజర్వు సబ్ ఇన్స్‌పెక్టర్ వరుణ్ అల్వా తన పోలీస్ కారు నుంచి బయటకు ఒక్కసారిగా దూకారు.

సందులు గొందులు తిరుగుతూ తప్పించుకోవడానికి ప్రయత్నస్తున్న దొంగని ఎట్టకేలకు వరుణ్ పట్టుకోగలిగారు.దొంగని కింద పడేసి మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు.

తర్వాత అతన్ని స్టేషన్ కు తరలించారు.ఈ ఛేజింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ జర్నలిస్ట్ వీడియో తీసి తాజాగా నెట్టింట షేర్ చేయగా.అది వైరల్ గా మారింది.‘మీరు సూపర్ సార్, హీరో సార్’ అంటూ నెటిజన్లు సదరు పోలీస్ ఆఫీసర్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

దొంగతనం జరిగినప్పుడు వలసకూలీ నెహ్రూ గ్రౌండ్స్ లో నిద్రపోతున్నాడని పోలీసులు తెలిపారు.ఈ కూలీ గ్రానైట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడట.అయితే ఇలా నిద్రపోతున్న వారి నుంచి విలువైన వస్తువులు దొంగలించడంతో పాటు మంగళూరులోని ఇళ్లకు కన్నం వేసే గ్యాంగ్ ఆగడాలు అంత కంతకూ పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో ధైర్యం చేసి ఒక దొంగని సబ్ ఇన్స్‌పెక్టర్ పట్టుకున్నారు.

అయితే ఈ నిందితుడు పేరు సమంత్ అని తేలింది.విచారణలో మొబైల్ ఫోన్స్ చోరీ చేస్తానని సమంత్ ఒప్పుకున్నాడు.

అలాగే తనతో పాటు ఓ ముఠా కూడా సెల్ ఫోన్స్ చోరీ చేస్తున్నారని వెల్లడించాడు.దాంతో సమంత్ ద్వారా వారిని పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే కమిషనర్ సురేష్ కుమార్ దొంగని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ కి 10,000 రూపాయలు అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube