అలర్ట్: ఆ ఈ-మెయిల్స్ పై క్లిక్ చేశారో.. మీ ఖాతా ఖాళీ.. జాగ్రత్త సుమీ..!

ప్రస్తుతం చాలామంది ఒమిక్రాన్ వైరస్ వేరియంట్ అంటేనే భయపడుతున్నారు.దీనికి సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా తెలుసుకొని జాగ్రత్త పడాలని ప్రయత్నిస్తున్నారు.

 Alert If You Click On These E Mails Then Your Accounts Will Be Emptied Details,-TeluguStop.com

తమ ఈ-మెయిల్స్ కు ఒమిక్రాన్ పేరిట వచ్చే వార్తలను తెగ చదివేస్తున్నారు.అయితే ఈ విషయాన్ని గమనించిన సైబర్ కేటుగాళ్లు.

ఒమిక్రాన్ పేరుతో మాల్‌వేర్‌ కలిగిన ఈమెయిల్స్ పంపిస్తూ టోకరా వేస్తున్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని విండోస్ యూజర్లు ఈ మాల్‌వేర్‌ బారినపడి బాగా నష్టపోయారు.

చాలామంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోయాయి.

ఈ నేపథ్యంలో ఫోర్టీగార్డ్ అనే ఓ సైబర్ సెక్యూరిటీ రీసర్చ్ సంస్థ యూజర్లను హెచ్చరించింది.

హ్యాకర్లు ఒమిక్రాన్ పేరుతో ఈమెయిల్స్ ద్వారా రెడ్ లైన్ స్టీలర్ అనే ఓ మాల్‌వేర్‌ సెండ్ చేస్తున్నారని.వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది.

లేకపోతే బ్యాంక్ వివరాలు, సున్నితమైన, వ్యక్తిగత సమాచారంతో సహా పాస్‌వర్డ్‌లన్నీ హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని వెల్లడించింది.ఒమిక్రాన్ పేరుతో వచ్చే ఈమెయిన్స్ పై క్లిక్ చేయకూడదని తెలిపింది.

‘Omicron Stats.exe’ అనే ఓ పేరుతో జీమెయిల్ ఇన్‌బాక్స్‌లోకి ప్రవేశించే రెడ్ లైన్ స్టీలర్ మాల్‌వేర్‌ను పొరపాటున కూడా క్లిక్ చేయకూడదని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది.

ప్రస్తుతం హ్యాకర్లు ఇలాంటి మాల్‌వేర్‌ ద్వారా యూజర్ల డేటా దొంగలించి వాటిని 10 డాలర్ల చొప్పున డార్క్ వెబ్ లో అమ్ముకుంటున్నారు.అలాగే యూజర్ల బ్యాంకు వివరాలతో అక్రమంగా నగదు డ్రా చేస్తున్నారు.ఈ విధంగా ప్రజల బలహీనతను గుర్తించి వారిని నిలువునా మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు.ప్రస్తుతం విండోస్ యూజర్లను ఎఫెక్ట్ చేస్తున్న ఈ మాల్‌వేర్‌ 2020లోనే వెలుగుచూసింది.

అయితే అదే మాల్‌వేర్‌ను ఇప్పుడు ఒమిక్రాన్ నేపథ్యంలోనూ వాడుతున్నారు.ఈ క్రమంలో యూజర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

అనుమానాస్పదంగా కనిపించే కొత్త ఈ-మెయిల్స్ పై క్లిక్ చేయకపోవడమే శ్రేయస్కరమని చెబుతున్నారు.

Cyber Attack By Hackers With the name of Omicron Stats

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube