అరెరే: ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డ్ బలే ఉందే..!

సాధారణంగా పెళ్లి పత్రిక అంటే అందులో ఏముంటాయి చెప్పండి.వధు వరుల పేర్లతో పాటు, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలతో పాటు విందు భోజనం గురించి ఉంటుంది.

 This Variety Wedding Card Is Great, Wedding Card, Latest News, Viral Latest, Se-TeluguStop.com

అలాగే శుభాకార్యం కాబట్టి దేవుడి బొమ్మలు, వేద మంత్రాలు, శ్లోకాలు లాంటివి ప్రచురణ చేసి ఉంటాయి.వెడ్డింగ్ కార్డ్స్ లో కూడా చాలా రకాల వెరైటీ కార్డ్స్ ఉంటాయి లెండి.

ఈ మధ్య కాలంలో అచ్చం ఆధార్ కార్డును పోలిన వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది.ఇప్పుడు కూడా ఒక వెరైటీ ఆలోచనతో ప్రచురించిన పెళ్లి పత్రిక ఒకటి అందరిని ఆకర్షిస్తుంది.

మహారాష్ట్రలో ఒక పెళ్ళికి సంబందించిన పెళ్లి పత్రికను చూస్తే మీరు షాక్ అవుతారు.ఎందుకంటే అ పత్రికనీ చూస్తే ఇదేదో కరోనా వాక్సిన్ సర్టిఫికెట్ లాగా ఉంది కదా అని అనుకోకుండా ఉండరు.

ఎందుకంటే ఆ వెడ్డింగ్ కార్డు చూడడానికి అచ్చం కరోనా వాక్సిన్ సర్టిఫికెట్ లాగా ఉంది కాబట్టి.అసలు ఆ వెడ్డింగ్ కార్డ్​పై ఏమి రాసి ఉందో ఒకసారి చూద్దామా.

దేశంలో మళ్ళీ కరోనా మూడో దశ విజృంభణ మొదలయింది.రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి.

ఈ మహమ్మారి భారీ నుండి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వాలు వాక్సిన్ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చింది.ప్రతి ఒక్కరు కూడా కరోనా టీకా తప్పని సరిగా వేసుకోవాలని ప్రభుత్వాలు ప్రజలందరికి సూచనలు సూచిస్తున్నాయి.

పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు ఉండాలని నిబంధనలు కూడా జారీ చేస్తున్నాయి.ఈ క్రమంలో మహారాష్ట్ర జలగావ్ జిల్లాలోని ఓ వివాహ ఆహ్వాన పత్రిక అందరిని ఆలోచింప చేసింది.

పెళ్లి పత్రికపై ఓ పేజీ మొత్తం కరోనా నిబంధనలను సూచిస్తూ ప్రచురించడం జరిగింది.అలాగే ఆ పత్రికలో పెళ్లికి వచ్చే అతిథులు వ్యాక్సినేషన్ వేసుకోవాలి అని, అదే తమకు ఇచ్చే కానుక అని రాసారు.

అదే జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు అనిల్​ కెర్హలే తమ కూతురు నికితా కేర్హలే కు ఇచ్చి త్వరలో పెళ్లి చేస్తున్నారు.నికిత కూడా మీడియాలోనే ఉద్యోగం చేయడంతో కొత్తగా ఉండాలని శుభలేఖను ఇలా డిజైన్ చేయించారు.

ఫిబ్రవరి 5న ఆమె పెళ్లికి ముహూర్తం ఖాయం అయింది.కానీ రోజు రోజుకు వారి జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగడంతో కఠిన నిబంధనలను విధించారు జిల్లా కలెక్టర్.

ఈ క్రమంలోనే అనిల్​ కెర్హలే వాక్సిన్ సర్టిఫికెట్ లాంటి వెడ్డింగ్ కార్డు తయారు చేయించారు.పేజీ ​పైభాగంలో దేవుళ్ళ బొమ్మల బదులుగా భౌతిక దూరం, శానిటైజేషన్ ప్రాముఖ్యాన్ని తెలిపే బొమ్మలను ముద్రించారు.

అలాగే పైభాగంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తును ముద్రించారు.అతిథులను ఉద్దేశిస్తూ.‘మీ వ్యాక్సినేషన్​ మా పెళ్లి కానుక’ అని రాయించారు.కింది భాగంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గుర్తును కూడా వేశారు.

అలాగే వెడ్డింగ్ కార్డ్ మరో పేజీలో నూతన వధూవరుల పేర్లు, వేడుక జరిగే ప్రదేశం,తేదిలతో సహా ఇతర వివరాలను ముద్రించారు.ఈ పెళ్లి పత్రికను జిల్లా కలెక్టర్ అభిషేక్​ రౌత్​కు అందించి పెళ్లికి ఆహ్వానించారు.

ఆ పెళ్లి పత్రిక చూసి అనిల్ కెర్హలే యొక్క ఆలోచన విధానం ప్రజలందరినీ ఆలోచింపచేసేలా ఉందని కలెక్టర్ ఆయన్ని ప్రశంసించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube