దిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా ఆశిష్ మొదటి సినిమా రౌడీ బోయ్స్ క్రేజీగా వస్తుంది.సంక్రాంతి కానుకగా దిల్ రాజు తనకున్న ఇమేజ్ మొత్తం వాడి స్టార్ హీరోలందరితో ఈ సినిమాని ప్రమోట్ చేయిస్తున్నాడు.
ఇక ఇదిలాఉంటే హర్ష డైరక్షన్ లో తెరకెక్కిన రౌడీ బోయ్స్ సినిమా వెనక మరో ఇద్దరు డైరక్టర్స్ ఉన్నారని తెలుస్తుంది.హర్ష తో పాటుగా ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో ఆ ఇద్దరు డైరక్టర్స్ హ్యాండ్ కూడా ఉందని అంటున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో పనిచేసిన వేణు శ్రీరాం, అనీల్ రావిపుడి ఇద్దరు దర్శకులు రౌడీ బోయ్స్ సినిమా వెనక ఉన్నారని టాక్.
సినిమా కథ ఫైనల్ అయిన దగ్గర నుండి ఫస్ట్ కాపి వచ్చే వరకు ఆ ఇద్దరు దర్శకులు తమ సలహాలు ఇచ్చారట.
అంతేకాదు సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక కూడా కొన్ని మార్పులు చెప్పారట.అందుకే హర్షతో పాటుగా రౌడీ బోయ్స్ సినిమాకు మరో ఇద్దరు దర్శకులు పనిచేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
తమ ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోగా ఎలాగైనా ఆశిష్ కు హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రౌడీ బోయ్స్ సినిమాకు అసలు డైరక్టర్ తో పాటుగా మరో ఇద్దరు దర్శకులతో పనిచేయించాడట దిల్ రాజు.మరి ఇంత కష్టపడిన ఈ సినిమాకు అదే రేంజ్ రిజల్ట్ వస్తుందా లేదా అన్నది చూడాలి మరి .