అఘోరా మేకప్ వేసిన అమ్మాయిని పరిచయం చేసిన బోయపాటి?

బోయపాటి దర్శకత్వంలో టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

 Boyapati Srinu On Nandamuri Balakrishna Akhanda Makeup Artist Vidhi, Boyapati Sr-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం నటించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాలి అంటే అఘోరా పాత్ర ఈ సినిమాకు మేజర్ ప్లస్ అయ్యింది అని చెప్పవచ్చు.అయితే ఈ సినిమా విడుదల కాకముందు అఘోరా పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు అని తెలియగానే బాలయ్య అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే అఘోర పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడు.బాలయ్య అఘోరాలా నటించడం ఏంటని అంతా అనుకున్నారు.అయితే అఘోర పాత్రలో బాలయ్య నటించాడు అనడం కంటే జీవించారు అని చెప్పవచ్చు.అయితే ఆ పాత్ర అంతగా రావడానికి, అంతలా ప్రభావం చూపించడానికి ఆ మేకప్ కూడా ఓ కారణం.

బాలయ్య సినిమాలో వేసుకున్న అఘోర పాత్ర మేకప్ కోసం దర్శకుడు బోయపాటి చాలా కేర్ తీసుకున్నారట.ఈ సినిమాలో బాలయ్య మేకప్ కోసం పంజాబీ అమ్మాయి అయినా మేకప్ ఆర్టిస్ట్ ను తీసుకు వచ్చినట్లు బోయపాటి తెలిపారు.

ఈ సినిమాలో ద్విపాత్రాభినయం కావడంతో, యంగ్ పాత్రలలో ఉన్నప్పుడు, అఘోర పాత్రకు చాలా తేడా ఉండాలని ఎంతో స్పెషల్ కేర్ తీసుకున్నామని తెలిపారు బోయపాటి.అఘోర పాత్రకు మేకప్ వేయాలంటే దాదాపుగా గంటన్నర, రెండు గంటలు పట్టేదట.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Artist Vidhi-Movie

దీంతో అమ్మాయి విధి ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి.అఘోర పాత్రకు మేకప్ వేసి తన ముందు ఉంచేదని బోయపాటి చెప్పుకొచ్చాడు.షూటింగ్ ఎక్కడున్నా సరే అది అడవిలో అయినా సరే బాలయ్యను రెడీ చేసి సరిగ్గా టైంకి తన ముందుకు తీసుకొచ్చేది అని చెప్పుకొచ్చారు బోయపాటి.మొత్తానికి అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర మాత్రం అందరినీ మెప్పించడమే కాకుండా.

బాలయ్యను చూస్తే శివుడిని చూసినట్టుందని తమన్ చెప్పిన సంగతి తెలిసిందే.కేవలం తమన్ మాత్రమే కాకుండా సినిమా చూసిన బాలయ్య ప్రతి ఒక అభిమాని కూడా అదే మాట అన్నారు.

అఘోరా పాత్రలో బాలయ్య నటించి వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్లేట్టేగా చేశాడంటూ చిత్రయూనిట్ బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube