ఆ మాటను మేము అనలేకపోయాం.. కమెడియన్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై ఎన్ని కామెడీ షోలు ప్రసారమవుతున్నా జబర్దస్త్ షో మాత్రమే నంబర్ 1 కామెడీ షో అని ప్రేక్షకులలో చాలామంది భావిస్తారు.ఈ షోలో ప్రసారమయ్యే స్కిట్లు కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి.

 Anchor Anasuya Shocking Comments About Tagubotu Ramesh Details, Tagubotu Ramesh,-TeluguStop.com

భోగి పండుగ కానుకగా ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎపిసోడ్ కు దర్శకుడు మారుతి గెస్ట్ గా హాజరయ్యారు.మారుతి తన సినిమాలు అన్నీ కామెడీ సినిమాలు అని తాను కామెడీ ప్రేమికుడిని అని కామెడీ షోకు రావడం అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు.

తాగుబోతు రమేష్ స్కిట్ లో భాగంగా డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇవ్వగా మారుతి మాట్లాడుతూ రమేష్ ఎలా రెడీ అయినా ఇప్పుడే బార్ నుంచి బయటకు వచ్చిన విధంగా ఉంటాడని కామెంట్లు చేశారు.అనసూయ వెంటనే మీరు కాబట్టి అనేశారని మేము ఆ మాట అనలేకపోయామంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

మారుతి, అనసూయ అలా చెప్పడంతో తాగుబోతు రమేష్ ఫక్కున నవ్వేశారు.ఈరోజు రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

తాగుబోతు రమేష్ సినిమాలలో ఎక్కువగా తాగుబోతు పాత్రల్లోనే నటించారనే సంగతి తెలిసిందే.

ఆ పాత్రలే అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.కొన్ని సినిమాల సక్సెస్ లో సైతం తాగుబోతు రమేష్ కీలక పాత్ర పోషించారు.అయితే కొత్త కమెడియన్ల ఎంట్రీతో అవకాశాలు తగ్గడంతో ఈ కమెడియన్ జబర్దస్త్ షోపై దృష్టి పెట్టారు.

హైపర్ ఆది టీమ్ స్కిట్ లో రోహిణి అబ్బాస్ హౌస్ కు నేనే యాంకర్ నని మిమ్మల్నందరినీ కడిగి పాడేస్తానని చెప్పగా ఇదే అబ్బాస్ యాడ్ లో ఉన్నట్టుగా ఇంటింటికీ తిరిగి కడిగేదానిలా ఉందంటూ రోహిణిపై ఆది పంచ్ వేస్తారు.జబర్దస్త్ కమెడియన్ ఆదితో బయట నా అభిమానులు క్యూ కడుతున్నారని చెప్పగా ఇందాక నువ్వే పునుగుల కోసం అరగంట క్యూలో నిలబడ్డావ్.నీకోసం క్యూ కట్టారా అంటూ ఆది పంచ్ వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube