టికెట్ ధరల విషయంలో నోరు మెదిపిన చైతూ..!

ఏపీ లో సినిమా టికెట్ల ధరల విషయం రోజురోజుకూ వివాదంగా మారుతున్న విషయం తెలిసిందే.ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ ధరలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది.

 Naga Chaitanyas Diplomatic Reply On Ap Ticket Prices Issue Details, Ap Ticket Pr-TeluguStop.com

ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సినీ పెద్దలు ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వాన్ని కోరారు.ఇంకా ఈ విషయంపై ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేయాలనీ టాలీవుడ్ ప్రముఖుల్లో ఉంది.

అయితే ఈ విషయంపై మిగతా హీరోలు ఎలా ఉన్నా తాజాగా నాగార్జున స్పందించిన తీరు పై చాలా మంది విమర్శలు చేసారు.నాగార్జున టికెట్ ధరల విషయంలో స్పందించారు.

ఈయన సినిమా టికెట్ రేట్ల విషయంలో తనకేం సమస్య లేదని చెప్పడం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.ఈయన ఈ విధంగా స్పందిస్తారని సినీ ప్రముఖులు ఊహించ లేదు.

తాజాగా నాగార్జున తనయుడు నాగ చైతన్య ఈ విషయంపై స్పందించారు.నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన తాజా సినిమా బంగార్రాజు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య వరుసగా ఇంటర్వ్యూ లు చేస్తూ ఉన్నాడు.

Telugu Ap, Ap Ticket, Ap Ticket Rates, Bangarraju, Naga Chaitanya, Nagachaitanya

తాజాగా నాగ చైతన్య పాల్గొన్న ఇంటర్వ్యూ లో నాగ చైతన్యను టికెట్ ధరల విషయంలో స్పందించమని కోరగా.దానికి ఆయన తండ్రి బాటలోనే సమాధానం ఇచ్చారు.”నేను నటుడిని.నా ప్రాజెక్ట్ ల ఆదాయ అంశాల గురించి నేను పెద్దగా బాధపడడం లేదు.టికెట్ ధరల సమస్య గురించి మీరు నా నిర్మాతలను అడగాలి.వారికీ దానితో సమస్య లేకపోతే నాకు కూడా లేదు.

Telugu Ap, Ap Ticket, Ap Ticket Rates, Bangarraju, Naga Chaitanya, Nagachaitanya

ఏప్రిల్ లో జీవో తిరిగి వచ్చింది.ఆగస్టులో చిత్రీకరణ స్టార్ట్ చేసాం.దీంతో జీవో ఆధారంగా బడ్జెట్ సవరించాం.

ప్రభుత్వం ధరల పెంపుకు అనుమతి ఇస్తే అది మాకు సహాయం చేస్తుంది.కాకపోతే ఇప్పుడు అమలులో ఉన్న దానితో మేము సంతృప్తి చెందుతున్నాం.

అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు.కాగా ఏపీలో ప్రభుత్వం 100 శాతం అక్యుపెన్సీ ఇవ్వడమే కాకుండా నైట్ కర్ఫ్యూ కూడా ఎత్తివేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube