టికెట్ రేట్ల వివాదానికి ఎండ్ కార్డ్ పడనుందా.. మెగాస్టార్ మాట జగన్ వింటారా?

ఏపీలో టికెట్ రేట్ల వివాదం గురించి ఏపీ రాజకీయ నాయకులు ఒక విధంగా స్పందిస్తుంటే సినీ ప్రముఖులు మరో విధంగా స్పందిస్తున్నారు.ఏపీలో అమలవుతున్న తక్కువ టికెట్ రేట్లు ఏపీలో పెద్ద సినిమాలను కొనుగోలు చేసిన బయ్యర్లకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగులుస్తున్నాయి.

 Chiranjeevi Meeting Cm Ys Jagan Over Cinema Ticket Rates Details, Cm Jagan, Tick-TeluguStop.com

పెద్ద సినిమాలు విడుదలైన రోజునే పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తుండటంతో సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి గతంలో టికెట్ రేట్ల సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేశారు.

అయితే ఆ ప్రయత్నాలకు తగ్గ ఫలితాలు మాత్రం రాలేదు.ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలవనున్నారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్, చిరంజీవి మధ్య భేటీ జరగనుంది.చిరంజీవి ప్రధానంగా టికెట్ రేట్ల గురించి ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.

విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అటు రాజకీయ నాయకులతో పాటు ఇటు సినిమా ప్రముఖుల పరువు కూడా పోతున్న నేపథ్యంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నారు.

అయితే టికెట్ రేట్ల విషయంలో చిరంజీవి చేసే విన్నపాలకు జగన్ సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కొన్నిరోజుల క్రితం జగన్ పేదల కోసం టికెట్ రేట్లను తగ్గించామని ప్రకటన చేశారు.టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తే జగన్ సర్కార్ పై విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉంటుంది.

మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ టికెట్ రేట్ల పెంపు విషయంలో అధ్యయనం చేస్తోంది.

టికెట్ రేట్ల సమస్య విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ భేటీతో సినిమా టికెట్ రేట్ల సమస్యకు ఎండ్ కార్డ్ పడాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.సంక్రాంతి పండుగకు పెద్ద సినిమా అయిన బంగార్రాజు రేపు థియేటర్లలో రిలీజవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube