నాన్నకు ప్రేమతో ఆరు ఏళ్ల క్రితం కాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే...!

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఎన్టీఆర్ ను డిఫరెంట్ గా స్టైలిష్ లుక్ లో దర్శకుడు సుకుమార్ నాన్నకు ప్రేమతో సినిమా లో చూపించడం జరిగింది.

 If Ntr Sukumar Nannaku Prematho Movie Now Release What Happen,  Ntr, Sukuma , Na-TeluguStop.com

ఆ లుక్‌ కు అభిమానులు అంతా ఫిదా అయ్యారు.ఎన్టీఆర్ లుక్ సూపర్ అంటూ ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.

తీరా సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు కూడా పెదవి విరిచారు.సుకుమార్ పెద్ద లెక్కల మాస్టర్.

ఆయన లెక్కలను అర్థం చేసుకోవాలంటే మనకు కూడా లెక్కలు వచ్చి ఉండాలి.అంటే ఆయన తీసిన స్క్రీన్ ప్లే మనకు అర్థం కావాలి అంటే మనము ఆయన మాదిరిగానే ఆలోచించాల్సి ఉంటుంది.

కానీ సుకుమార్ స్థాయిలో ఆలోచించడం అప్పటి ప్రేక్షకుల వల్ల కాలేదు.అందుకే నాన్న కు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేదు అంటారు విశ్లేషకులు.

సుకుమార్ స్థాయి ఏంటి అనేది ఆ సినిమా నిరూపించింది.సుకుమార్ ఒక మంచి దర్శకుడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు అని ఆ సినిమా మరోసారి నిరూపించింది.

కానీ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించ లేదు.కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే దక్కాయి.

ఎన్టీఆర్ పాత్ర తీరును అప్పటి ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారు.కానీ ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా విడుదల అయితే కచ్చితంగా మంచి విజయాన్ని.

అది కూడా కమర్షియల్ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం.మరో నాలుగు సంవత్సరాల తర్వాత నాన్నకు ప్రేమతో వస్తే మరింత పెద్ద విజయాన్ని దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు.

Telugu Pushpa, Rangasthalam, Sukuma, Sukumar, Tollywood-Movie

ఎందుకంటే ప్రేక్షకుల ఆలోచన తీరు మరియు అభిరుచి రోజు రోజుకీ.సంవత్సరం సంవత్సరానికి మారుతూనే ఉంది.అందుకే సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలం లో మంచి విజయాలను దక్కించుకున్నాయి.సుకుమార్ గత చిత్రం రంగస్థలం తాజా చిత్రం పుష్ప ఈ రెండు కూడా ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాయి.ముఖ్యంగా పుష్ప రూ.320 కోట్ల వసూళ్లను దక్కించుకొని బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టింది.2021 వ సంవత్సరంలో ఇండియా మొత్తం విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా పుష్ప నిలిచిందంటే సుకుమార్ ప్రతిభ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.అలాంటి సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ ఇప్పుడు విడుదల అయితే మాత్రం కచ్చితంగా రెండు వందల కోట్ల వసూళ్లు ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube