ఆ వ్యతిరేక ఉద్యమానికి హీరో కార్తీ మద్దతు.. అది ఏమిటంటే?

తమిళ హీరో కార్తీ గురించి మన అందరికి తెలిసిందే.తమిళంలో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో అతను హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.

 Actor Karthi Supports Anty Movement On Gm Foods, Hero Karthi, Gm Foods, Supports-TeluguStop.com

ఇది ఇలా ఉంటే హీరో కార్తీ తాజాగా జన్యు మార్పిడి ఆహార పదార్ధాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆన్ లైన్ ప్రచార ఉద్యమానికి హీరో కార్తీ మద్దతు ప్రకటించారు.ఇక ఈ ఉద్యమానికి అనుకూలంగా పార్టీ ఆన్ లైన్ సిగ్నేచర్ చేశారు.

ఇక ఈ సందర్భంగా జన్యు మార్పిడి ఆహార పదార్థాల వల్ల కలిగే నష్టాలను ఆయన వివరిస్తూ ఒక ట్వీట్ చేశారు.అంతేకాకుండా ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని హీరో కార్తీ కోరారు.

ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ జన్యుపరంగా మార్పులు చేసి, జన్యు పరంగా అభివృద్ధి చేసిన ఆహార పదార్థాల పై ఉన్న నియంత్రణతో పాటుగా నిబంధనలను కూడా మార్చబోతోంది.ఇక ఈ నిర్ణయం వల్ల అలాంటి ఆహార పదార్థాలు మన జీవితాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

అటువంటి ఆహార పదార్థాలు జీవితాల్లోకి ప్రవేశించడం వల్ల, అదేవిధంగా జన్యు పరంగా అభివృద్ధి చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల అలర్జీ, పెరుగుదల మందగించడం, అవయవ లోపం, పునరుత్పత్తి పై తీవ్ర ప్రభావం, రోగనిరోధక శక్తి లోపించడం లాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అని గుర్తించారు.అంతేకాకుండా ప్రపంచంలోని అనేక ప్రపంచ దేశాలు ఈ జన్యు మార్పిడి ఆహార పదార్థాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Telugu Safety, Gm Foods, Karthi, Kollywood-Movie

అలాగే పలు బహుళజాతి సంస్థలకు తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ పర్యావరణం ఆరోగ్యం సురక్షితం కాదని భావిస్తున్నాయి.అందువల్ల జన్యు మార్పిడి పంటలను మనదేశంలో అనుమతించలేదు.ఇక జన్యుమార్పిడి చేసిన బీటీ వంకాయ, జిఎం ఆవాలు వంటివి ఇందుకు ప్రధాన నిదర్శనం.ఈ నేపథ్యంలోనే ఫుడ్ ఏపీ నిబంధనలను సడలించి జన్యు మార్పిడి ఆహారపదార్ధములు మనదేశంలో కి ఎందుకు అనుమతిస్తున్నారు అర్థం కావడం లేదు.

ఇలాంటి ఆహార పదార్థాలను వ్యతిరేకించాలి.ఇందుకోసం సాగుతున్న ఆన్లైన్ సిగ్నేచర్ ప్రచారానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలి అని హీరో కార్తీ ప్రతి ఒక్కరినీ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube