బ్లాక్ బస్టర్ 'నువ్వేకావాలి' సినిమాను.. పవన్ కళ్యాణ్ తో పాటు ఆ హీరో కూడా రిజెక్ట్ చేశాడట?

తెలుగు చిత్ర పరిశ్రమలో నువ్వేకావాలి సినిమా ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏకంగా కొత్త హీరో అయినప్పటికీ టాలీవుడ్ యూత్ అందరిని ఆకర్షించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

 Heros Who Are Rejected Nuvve Kaavali Movie Pawan Kalyan Tharun Details, Nuvve Ka-TeluguStop.com

దీంతో ఈ ఒక్క సినిమాతోనే హీరో తరుణ్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా ను ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు.

విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి విడుదలైన తర్వాత ఇరవై కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాతో నిర్మాతలకు లాభాల పంట పండింది అని చెప్పాలి.

ముఖ్యంగా వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో తరుణ్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించిన నువ్వేకావాలి సినిమా ఏకంగా అప్పట్లో ఇద్దరు హీరోలు రిజెక్టు చేశారట.కానీ ఆ తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మాత్రం ఎందుకు రిజెక్ట్ చేశామా అని బాధపడ్డారట.

నువ్వేకావాలి సినిమా లో రీఛా తరుణ్ సరసన హీరోయిన్ గా  నటించింది.

Telugu Vijaya Bhaskar, Sumanth, Tarun, Heroes, Nuvve Kavali, Pawan Kalyan, Ramoj

అయితే ముందుగా నువ్వేకావాలి సినిమా స్టోరీ ని దర్శకుడు విజయ భాస్కర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వినిపించారట.అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చేస్తూ బిజీగా ఉండటంతో ఇక ఈ సినిమాని రిజెక్ట్ చేశారట పవన్ కళ్యాణ్.ఇక ఆ తర్వాత అక్కినేని వారసుడు సుమంత్ దగ్గరికి ఈ కథ వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే అప్పటికే సుమంత్ వరుసగా లవ్ స్టోరీ లలో నటిస్తున్నాడు.దీంతో ఇది కూడా లవ్ స్టోరీ కావడంతో ఇక ఈ సినిమాకు నిర్మొహమాటంగా నో చెప్పేశాడట.

Telugu Vijaya Bhaskar, Sumanth, Tarun, Heroes, Nuvve Kavali, Pawan Kalyan, Ramoj

ఇక ఆ తర్వాత ఈ సినిమా ట్రాక్ లోకి తరుణ్ వచ్చేశాడట.ఇక ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు.ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత మేము ఎందుకు రిజెక్ట్ చేశామా అని ఇద్దరు హీరోలు అనుకున్నారట.నువ్వే కావాలి ఇప్పటికీ ఒక మెమొరబుల్ సినిమాగా తెలుగు ప్రేక్షకులకు నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube