కొండ చిలువ ఇలా కూడా చెట్టెక్కుతుందా.. చూస్తేనే హ‌డ‌ల్‌

సోషల్ మీడియా ప్రపంచంలో మనకు రోజూ ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తూ ఉంటాయి.కొన్ని విషయాలు చూసి మనం సరదాగా నవ్వుకుంటే కొన్ని విషయాలను చూస్తే వెంటనే మనకు భయం పుడుతుంది.

 Does The Python Also Cut Like This , Python, Viral Video ,ifs Officer Sushant Na-TeluguStop.com

అటువంటి విషయాలలో ఉండేవి పాముల వీడియోలు.ప్రస్తుతం నెట్టింట్లో మనకు అనేక రకాల పాముల వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

అటువంటి వాటిలో కొండచిలువల వీడియోలు కూడా ఉంటాయి.కొండచిలువలు చూసేందుకు భారీ సైజు పాములా ఉన్నా కూడా వాటి పేరు చెబితేనే మనకు ఎక్కడ లేని భయం పుడుతుంది.

కొండ చిలువలు భారీ జంతువులను మనుషులను ఈజీగా మింగేస్తాయని అనేక మంది చెబుతారు.కొండచిలువలు వాసనతో పసిగడతాయని కూడా అంటారు.

ప్రస్తుతం ఆ విషయాన్ని అలా పక్కనపెడితే సోషల్ మీడియాలో ఓ కొండచిలువ వీడియో మాత్రం వామ్మో అని అనిపించేలా చేస్తుంది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.

మామూలుగా పాములు చెట్లు ఎక్కవని అనేక మంది నమ్ముతారు.మనం కూడా పాములు చెట్ల మీద ఉన్నాయని చాలా తక్కువ సందర్భాల్లో విని ఉంటాం.

కానీ ఇప్పుడు మాత్రం ఓ వీడియోలో ఓ కొండ చిలువ మనుషులకు కూడా సాధ్యం కాని రీతిలో అవలీలగా చెట్టును ఎక్కేస్తుంది.ఈ వీడియో చూస్తేనే చెమటలు పుడుతున్నాయి.

ఈ వీడియోను ట్విటర్ లో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద షేర్ చేశారు.పాములు ఇలా కూడా చెట్టెక్కుతాయా? అని అనే విధంగా ఉన్న ఆ వీడియోను చూసిన నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.వామ్మో ఇదేం కొండచిలువరా బాబు చూస్తే పై ప్రాణాలు పైనే పోతున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి.

ఏమని అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మరువకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube