అప్పుల బాధ తట్టుకోలేక 'కేఫ్ కాఫీ డే ఓనర్' ఆత్మహత్య.. అతని భార్య ఏం చేసిందో తెలిస్తే?

ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తారు.మరికొందరు ఆ కష్టాన్ని ఎదుర్కోలేక పిరికివాళ్లుగా ఉంటారు.

 Cafe Coffee Day Owner Siddharth Suicide Due To Debt What Did Wife Malavika Said-TeluguStop.com

ఆ సమయంలో వాళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది.అలా సామాన్యులే కాకుండా ఎంతో పలుకుబడి ఉన్న కుటుంబాలు కూడా ఇటువంటి కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

కాని చివరికి తమ కుటుంబాలే ఒంటరి జీవితాలుగా ఏమి చేయలేక మిగిలిపోతాయి.

అలా ఓసారి ఓ బిజినెస్ మాన్ కూడా అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

చివరికి అతని భార్య ఆ అప్పులన్నీ ఎలా తీర్చిందో.ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం.

దేశంలో అతిపెద్ద కాఫీ రిటైల్ మార్కెట్ కాఫీ డే ను సిద్ధార్థ్ అనే ఓ వ్యాపార వేత్త ప్రారంభించారు.ఇక ఈయన భార్య మాళవిక హెగ్డే.

ఆమె ఎవరో కాదు.బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ కూతురే మాళవిక.

ఇక ఆ సమయంలో ఈమె కూడా కొన్ని కంపెనీలకు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.ఇక తమ ఆధీనంలో 24 కంపెనీలు ఉండగా అందులో 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇక ఓసారి తమ వ్యాపారంలో తీర్చలేని నష్టాలు రావడంతో సిద్ధార్థ తట్టుకోలేక 2019 న జూలై 13న మంగళూరు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు.ఆ తర్వాత ఆ కంపెనీ బాధ్యతలు మొత్తం ఆయన భార్య మాళవిక ధైర్యంగా ముందుకు వచ్చి మోసింది.

Telugu Cafe Coffee Day, Commits, Debts, Malavika Hegde, Siddharth-Latest News -

తమ కంపెనీ బాధ్యతల భవిష్యత్తులు మొత్తం తానే చూసుకుంటానని మాట ఇచ్చింది.తమ కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అప్పులన్నీ తీరుస్తానని మాట ఇచ్చింది మాళవిక.తన భర్త చనిపోయిన ఏడాదిలోనే ఆమె బోర్డు లో అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టింది.ఈమె తొలిసారిగా ఎకనామిక్స్ టైమ్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో తన గురించి చాలా విషయాలు పంచుకుంది.అంతేకాకుండా తాను ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపింది.

Telugu Cafe Coffee Day, Commits, Debts, Malavika Hegde, Siddharth-Latest News -

తన భర్త మరణం తనకు తీరనిలోటని.తన భర్త చనిపోయిన తర్వాత ఆ బాధ, ఆ కష్టాలను ఓర్చుకొని ఉన్నానని తెలిపింది.ఒక వైపు తన భర్త పరువు కాపాడడానికి మరోవైపు 7 వేల కోట్ల అప్పుల్లో కంపెనీ, అందులో వేల మంది ఉద్యోగుల జీవితాలను చూసుకొని ముందుకు నడిచానని తెలిపింది.కంపెనీలు మూసేస్తే ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని.

అలాంటివి జరగకూడదని దైర్యంగా నిలుచున్నానని తెలిపింది.

Telugu Cafe Coffee Day, Commits, Debts, Malavika Hegde, Siddharth-Latest News -

అలా కొంతకాలం తర్వాత కంపెనీ అప్పులను సగానికి తీర్చానని.ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చానని తెలిపింది.అంతేకాకుండా ఉద్యోగులు కష్టకాలంలో కూడా అండగా ఉన్నారని, బ్యాంకులు కూడా తమ కోసం వేచి చూశాయి అని తెలిపింది.

మోదీ ఆత్మ నిర్భర్ తమల్ని ఉదాహరించుకున్నాయని తెలిపింది.అంతేకాకుండా కంపెనీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని చెబుతూ మరెన్నో విషయాలు పంచుకుంది మాళవిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube