ఇదేందయ్యా ఇది: పెళ్లి రోజే, భార్య కళ్ళముందే వేరే అమ్మాయి వచ్చి..?!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.కొన్ని చూడడానికి ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం భయంకరంగాను, ఆసక్తికరంగాను ఉంటాయి.

 Prank On Couples Man In Burkha Giving Hug To Groom Infront Of Bride Viral Detail-TeluguStop.com

అలాగే ఈ మధ్య ఎక్కువగా పెళ్లికి సంబందించిన వీడియోలు అయితే భలే వైరల్ గా మారుతున్నాయి.పెళ్లి వేడుకలో నూతన వధూవరులు ఒకర్ని ఒకరు ఆటపట్టించుకోవడం, డాన్సులు వేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఇలా రకరకాల వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక పెళ్లి వేడుకలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పెళ్లి అయ్యాక ఏ భార్య అయిన తన భర్త తనకే సొంతం అని అనుకుంటుంది.

అలాగే ఏ భర్త అయినా తన భార్య తనకే సొంతం అనే భావనలో ఉంటాడు.

అలాంటిది తన కళ్ళ ఎదుటే పెళ్లైన తొలిరోజే పెళ్లి వేదికపైన తన భర్తను వేరే మహిళ హగ్ ల మీద హగ్ లు ఇచ్చిఅతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే పాపం ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

మనకి వినడానికే ఇంత కష్టంగా ఉంటే తన కళ్ళ ఎదుటే ఇంతటి ఘోరం జరుగుతుంటే ఆ భార్య పరిస్థితి ఇంకెలా ఉంటుందో కదా.కానీ చివరలో ట్విస్ట్ ఉంటుంది చూడండి.మాములుగా ఉండదు మరి పెళ్లి కొడుకుతో పాటు పెళ్ళికి వచ్చిన బంధువులు అందరు కూడా పెళ్ళికొడుకుని కౌగిలించుకున్న మహిళను చూసి షాక్ అయ్యి నవ్వు ఆపుకోలేరు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.ఒక కొత్త జంట పెళ్లి చేసుకుని స్టేజ్ పై నుంచుని ఉండగా ఆ నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ఒక్కొక్కరూ స్టేజ్‌పైకి వస్తూ వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.

అయితే ఉన్నటుండి ఒక మహిళ బురఖా ధరించి వేదికపైకి ఎక్కి ముందుగా పెళ్లి కూతురికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి విషెస్ చెబుతుంది.తర్వాత వరుడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి విషెస్ చెప్పి ఉన్నటుండి పెళ్ళికొడుకుని వాటేసుకుంటుంది.అసలు వదలకుండా మళ్ళీ.మళ్ళీ… కౌగిలించుకుంటూ ఉంటుంది.అది చూసి పక్కనే ఉన్న భార్యతో సహా ఫంక్షన్ కి వచ్చిన అందరు కూడా షాక్ అవుతారు.అయితే పెళ్లి కొడుకుని కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఆ మహిళ తాను వేసుకున్న బురఖాను నెమ్మదిగా తీసేసింది.

అప్పుడే అసలు విషయం బయట పడింది.బురఖా ధరించి వచ్చినది మహిళ కాదు మగాడు అని.

పెళ్లి కొడుకు స్నేహితుడు అతడిని సరదగా ఆటపట్టిద్దామని అలా బురఖా రూపం ధరించి ఆడ వేషంలో వచ్చాడన్నమాట.ఆడ వేషంలో వచ్చిన వ్యక్తిని చూసి పెళ్లికి వచ్చిన వారితో పాటు పెళ్లి కూతురు కూడా తెగ నవ్వింది.పెళ్ళిలో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ను అక్కడ ఉన్న కొందరు స్నేహితులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube