డాక్టర్ బాబుతో స్టెప్పులు వేసిన సౌందర్య.. ఈ వయసులో అవసరమా అంటూ ట్రోల్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను కాకుండా సెలబ్రెటీలను కూడా బాగా ఆకట్టుకుంటుంది.ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది.

 Soundary Do A Steps With Dr Babu Is It Necessary At This Age Netizens Are Trolli-TeluguStop.com

ఇందులో పాత్రలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.అందులో డాక్టర్ బాబు, వంటలక్క, సౌందర్య పాత్రలు మాత్రం ప్రేక్షకులను ఫిదా చేశాయి.

ఇక ఆన్ సెట్ లో వీళ్లు బాగా ఎమోషనల్ గా ఉంటూ ఎమోషనల్ గా యాక్ట్ చేస్తూ ఉంటారు.కానీ ఆఫ్ సెట్ లో మాత్రం వీరంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

కాస్త బ్రేక్ దొరికితే చాలు తెగ వీడియోలు చేస్తూ బాగా టైం పాస్ చేస్తూ ఉంటారు.ఇక వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటారు.

కార్తీకదీపంలో నటించే ప్రతి ఒక్కరూ తమ ఇన్ స్టా లో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు.అందులో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ సరదా కామెంట్లు కూడా పెడుతూ ఉంటాడు.

చాలా వరకు ఆయన చేసే సరదా కామెంట్ లు మొత్తం కార్తీకదీపం క్యారెక్టర్లను ఉద్దేశించి ఉంటాయి.

అంతేకాకుండా తనకు సంబంధించిన ఫోటోలను, కార్తీకదీపం ఆర్టిస్టులతో దిగిన ఫోటోలను, చేసిన వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటాడు.

అప్పుడప్పుడు వంటలక్కతో కూడా ఫోటోలు దిగుతూ వాటిని బాగా షేర్ చేసుకుంటాడు.ఇక తాజాగా తన తల్లితో కలిసి స్టెప్పులు వేశాడు డాక్టర్ బాబు.దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా లో పంచుకున్నాడు.

అందులో ఈమధ్య ఇన్ స్టా లో బాగా ఫేమస్ అవుతున్న ఒక రాక్ మ్యూజిక్ తో డాక్టర్ బాబు, సౌందర్య కలిసి స్టెప్పులు వేశారు.ఇక సౌందర్య వైట్ కలర్ డ్రెస్ వేసుకొని తన కొడుకు కార్తీక్ పక్కన డాన్స్ చేయడంతో చాలామంది తెగ లైక్స్ కొడుతున్నారు.ఇక కొందరు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వయసులో అలా చేయటం అవసరమా అంటూ సౌందర్య ను ట్రోల్స్ చేస్తున్నారు.

నిజానికి వీరిద్దరి వయసు మధ్య చాలా తక్కువ తేడా ఉంది.

కానీ సీరియల్ లో ఇద్దరు తల్లి కొడుకు పాత్రలో నటించడంతో.ఆ పాత్రను ఉద్దేశించి కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లను బాగా చేస్తున్నారు.

ఇక కొందరు మాత్రం సౌందర్య ఎనర్జీ చూసి లైక్ కొడుతున్నారు.అందం లోనే కాదు ఎనర్జీ లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తారు అంటూ పొగుడుతున్నారు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం కార్తీకదీపం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.ఇక ప్రస్తుతం ఈ సీరియల్ లో కార్తీక్.సౌందర్య ను వదిలి తన భార్యాబిడ్డలతో మరో కాపురం పెట్టిన సంగతి తెలిసిందే.ఈ సీరియల్ తో పాటు డాక్టర్ బాబు, సౌందర్య మరో సీరియల్ లో కూడా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube